HomeTeluguఆకాశ్ పూరీ చేతుల మీదుగా విడుదలైన ‘GTA’ సినిమా ట్రైలర్..

ఆకాశ్ పూరీ చేతుల మీదుగా విడుదలైన ‘GTA’ సినిమా ట్రైలర్..

చైతన్య పసుపులేటి, హీనా రాయ్ జంటగా అశ్వద్ధామ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో డాక్టర్ సుశీల నిర్మిస్తున్న సినిమా GTA (గన్స్ ట్రాన్స్ యాక్షన్). విభిన్నమైన కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు దీపక్ సిద్ధాంత్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు ఆకాశ్ పూరీ, నందు హాజరయ్యారు. వీళ్ళ చేతుల మీదుగానే ట్రైలర్ విడుదలైంది. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు.. గ్యారీ బిహెచ్ ఎడిటర్. ప్రసాద్ బాపు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా.. త్వరలోనే విడుదల కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

దర్శకుడు దీపక్ సిద్ధాంత్ మాట్లాడుతూ.. ‘GTA (గన్స్ ట్రాన్స్ యాక్షన్) సినిమా కథ చాలా విభిన్నంగా ఉంటుంది. ఈ సినిమా కచ్చితంగా మీకు నచ్చుతుందని భావిస్తున్నా.. రెగ్యులర్ కమర్షియల్ అంశాలతో పాటు ఈ సినిమాలో ప్రతీ ఒక్కటీ మిమ్మల్ని అలరిస్తుంది. రొటీన్‌కు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది.. ట్రైలర్ చూసారుగా.. అందరికీ నచ్చిందా.. సినిమా ఇంతకంటే అద్బుతంగా ఉంటుందని ధీమాగా ఉన్నాం.. అదే రేపు థియేటర్స్‌లోనూ కనిపిస్తుంది’ అని నమ్మకంగా తెలిపారు.

హీరో ఆకాశ్ పూరీ మాట్లాడుతూ.. ‘GTA ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. ట్రైలర్ చూసాను.. చాలా బాగుంది.. దర్శకుడు దీపక్ వర్క్ బాగా నచ్చింది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది. కొత్తదనం ఉన్న కథలను తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు. అలాగే GTA పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ.. చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అని తెలిపారు.

నందు మాట్లాడుతూ.. ‘GTA ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఆకాశ్ చెప్పినట్లు సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నా.. దర్శకుడు దీపక్ సిద్ధాంత్ వర్క్ చాలా బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు.

హీరో చైతన్య మాట్లాడుతూ.. నేను.. మా డైరెక్టర్ దీపక్ కాలేజ్ టైం లో శత్రువులం..తర్వాత ఫ్రెండ్స్ గా అయ్యాం..తన దర్శకత్వంలో నేను హీరోగా..చేయడం చాలా హ్యాపీగా ఉంది. నేను హీరో గా మీ ముందు ఉండటానికి దీపక్ వాళ్ళ అమ్మా గారే కారణం..సినిమా బాగా వచ్చింది. మీ ఆశీస్సులు కావాలి..అన్నారు.

నటీనటులు:

చైతన్య పసుపులేటి, హీనా రాయ్, శ్రీకాంత్ అయ్యంగార్, కుమరన్, సుదర్శన్, రామకృష్ణ, ఆర్ఎక్స్ 100 కరణ్, వివేక్ ఫలక్‌నుమా, రూపలక్ష్మి, చిత్రం శ్రీను, లోబో తదితరులు

టెక్నికల్ టీం:

బ్యానర్: అశ్వద్ధామ ప్రొడక్షన్స్
దర్శకుడు: దీపక్ సిద్ధాంత్
నిర్మాత: డాక్టర్ సుశీల
సంగీతం: మార్క్ కే రాబిన్
ఎడిటర్: గ్యారీ బిహెచ్
Dop: ప్రసాద్ బాపు
Pro: లక్ష్మీ నివాస్

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES