HomeTeluguశ్రీ మల్లికార్జునస్వామి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్-2 చిత్రం జనవరిలో ప్రారంభం !!

శ్రీ మల్లికార్జునస్వామి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్-2 చిత్రం జనవరిలో ప్రారంభం !!

 

మా ఊరి ప్రేమకథ” చిత్రంలో హీరోగా నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మంజునాథ్.. అదే ఉత్సాహం, ఎనర్జీతో మరో డిఫరెంట్ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో నయామి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ మల్లికార్జునస్వామి క్రియేషన్స్ పతాకంపై వర్ష-వర్షిణి సమర్పణలో మంజునాథ్ స్వీయ దర్శకత్వంలో శ్రీమతి లక్ష్మీదేవి-యస్వీ మహేంద్ర నాథ్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెంబర్-2 చిత్రం జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు.

హీరో, దర్శకుడు- మంజునాథ్ మాట్లాడుతూ-” ఒక లేబర్ కుర్రాడు జీవితంలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. విలేజ్ నుండి సిటీకి వచ్చిన ఒక లేబర్ యువకుడు అనుకోని పరిణామాల వల్ల అతని జీవితం ఎలా టర్న్ అయింది అనేది మెయిన్ చిత్ర కాన్సెప్ట్. ఫ్యామిలీ, సెంటిమెంట్, యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి.. హీరోగా, దర్శకుడిగా నాకు ఈ చిత్రం మంచి టర్ణింగ్ పాయింట్ అవుతుంది అని గట్టి నమ్మకం వుంది.. అన్నారు.

నిర్మాతలు శ్రీమతి లక్ష్మీదేవి- ఎస్వీ. మహేంద్ర నాథ్ మాట్లాడుతూ.. ” తెలుగు తెరపై ఇప్పటి వరకూ రాని ఓ సరికొత్త కాన్సెప్ట్ తో కమర్షియల్ అంశాలు జోడించి అత్యధిక భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ప్రముఖ నటీ,నటులు అందరూ ఈ చిత్రంలో నటిస్తున్నారు. జనవరి మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంబించనున్నాం. ఇందులో నాలుగు భారీ యాక్షన్ సన్నివేశాలు, ఐదు పాటలు ఉంటాయి. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తయింది. రెండు పాటలు సెట్స్ వేసి షూట్ చేస్తాం. మరో మూడు పాటలు అవుట్ డోర్ లో చిత్రీకరిస్తాం. కర్ణాటక, బెంగళూర్, కొచ్చిన్, హైదరాబాద్ లలో షూటింగ్ జరిపి రెండు షెడ్యూల్స్ లలో సినిమా పూర్తి చేయాలనీ పక్కాగా ప్లాన్ చేశాం.. అన్నారు.

మంజునాథ్, నయామి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీ,నటులందరూ యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా; బోర్లగడ్డ కళ్యాణ్, మ్యూజిక్; హరీష్, ఎడిటర్; ప్రవీణ్, ఆర్ట్; భాస్కర్, కాస్ట్యూమ్స్ డిజైనర్; సత్యవతి, పీఆరోఓ; జిల్లా సురేష్, కో-ప్రొడ్యూసర్; యు.గోవిందరాజులు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం; యస్వీ. మంజునాథ్, నిర్మాతలు; శ్రీమతి లక్ష్మీదేవి-ఎస్వీ మహేంద్ర నాథ్.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES