HomeTeluguసహస్ర ఎంటటైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర పూజా కార్యక్రమాలతో ప్రారంభం !!!

సహస్ర ఎంటటైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర పూజా కార్యక్రమాలతో ప్రారంభం !!!

సహస్ర ఎంటటైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభం అయ్యాయి. విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా బసి రెడ్డి రాన దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

బొమ్మరిల్లు భాస్కర్, సుద్దాల అశోక్ తేజ ఈ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హైదరాబాద్, కర్నూల్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. నరేంద్ర బుచ్చి రెడ్డిగారి నిరిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 14 నుండి ప్రారంభం కానుంది.

సాక్షి రంగారావు అబ్బాయి సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కాబోతున్నాయి. సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం నిర్మితమవుతుంది.

నటీనటులు: విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ, సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి తదితరులు
బ్యానర్: సహస్ర ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ: నిశాంత్ ప్రెజెంట్స్
దర్శకత్వం: బసి రెడ్డి రాన
నిర్మాత: నరేంద్ర బుచ్చి రెడ్డిగారి
సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి
మ్యూజిక్: లిజో కె జోష్
ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల
ఆర్ట్: నిఖిల్ హాసన్
పిఆర్ఒ: శ్రీధర్

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES