సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నసినిమా ‘హంట్’. మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ప్రధాన పాత్రలు పోషించారు. నేపథ్యంలో రూపొందుతోన్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. సినిమాలో ‘పాపతో పైలం…’ పాటను విడుదల చేశారు.
‘పటాకా సాంగ్ ఆఫ్ ది ఇయర్’ అంటూ విడుదల చేసిన ‘పాపతో పైలం…’లో సుధీర్ బాబుతో పాటు అప్సరా రాణి స్టెప్పులు వేశారు. ‘క్రాక్’, ‘సీటీమార్’ తర్వాత మరోసారి ప్రత్యేక గీతంలో ఆమె సందడి చేశారు. ఇందులో సుధీర్ బాబు, అప్సరా రాణితో పాటు శ్రీకాంత్, భరత్ కూడా డ్యాన్స్ చేశారు. ఈ పాటకు యశ్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. జిబ్రాన్ సంగీతం అందించగా… మంగ్లీ, ‘పుష్ప’ ఫేమ్ (‘ఏ బిడ్డా ఇది నా అడ్డా…’ పాడిన) నకాష్ అజీజ్ ఆలపించారు.
”సీటిగొట్టి సీటీగొట్టి మిట్ట మిట్ట సూత్తారే
సిట్టి పొట్టి బట్టలెత్తే సింపుకోని సత్తారే
నడుము సూత్తే పావుశేరే పావురాలైతారే
బాడీలోన ఉందని ఫైరే బంకుకే రానీరే
తెల్లచీర కట్టుకొని పెడితె ఎర్రబొట్టే
పదారేళ్ళ ఆంబులెన్సు టక్కరిచ్చినట్టే
ఆ… ఊ… ఏ… ఓ…
అడికినకిడి తకిడి తికిడి
పైలం పాపతో పైలం
జర పైలం షేపుతో పైలం
పైలం పాపతో పైలం
జర పైలం ఊపుతో పైలం”
అంటూ సాగిన ఈ గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. విడుదలైన కొన్ని క్షణాల్లో ఈ పాట వైరల్ అయ్యింది. విజువల్స్ చూస్తే పబ్‌లో ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా రిచ్‌గా షూట్ చేసినట్లు అర్థం అవుతోంది.
ఈ సందర్భంగా చిత్రనిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ “సినిమాలో రెండు పాటలు ఉన్నాయి. ఈ రోజు ‘పాపతో పైలం’ విడుదల చేశాం. దీనికి మంచి స్పందన లభిస్తోంది. సుధీర్ బాబు ఎనర్జీగా, స్టైలుగా డ్యాన్స్ చేశారని, సాంగ్ బావుందని ఆడియన్స్ చెబుతున్నారు. ఇదొక స్టైలిష్ అండ్ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్ పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేశారు. ఆల్రెడీ విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం” అని చెప్పారు.
‘హంట్’ సినిమాలో నటీనటులు:
సుధీర్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మంజుల, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, ‘జెమినీ’ సురేష్, అభిజీత్ పూండ్ల, కోటేష్ మన్నవ, సత్య కృష్ణన్ తదితరులు ఇతర తారాగణం.
‘హంట్’ సినిమా సాంకేతిక వర్గం :
ఆర్ట్ డైరెక్టర్ : వివేక్ అన్నామలై, కాస్ట్యూమ్ డిజైనర్ : రాగ రెడ్డి, యాక్షన్ : రేనౌడ్ ఫవేరో (యూరోప్), స్టంట్స్ : వింగ్ చున్ అంజి, ఎడిటర్ : ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం : జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి, నిర్మాత : వి. ఆనంద ప్రసాద్, దర్శకత్వం : మహేష్.
PRO;PULGAM CHINNARAYANA