HomeTelugu`శ్రీవిష్ణు, ప్రదీప్ వర్మ, లక్కీ మీడియా 'అల్లూరి' యాత్ర సెప్టెంబర్ 3న వైజాగ్ నుండి ప్రారంభం...

`శ్రీవిష్ణు, ప్రదీప్ వర్మ, లక్కీ మీడియా ‘అల్లూరి’ యాత్ర సెప్టెంబర్ 3న వైజాగ్ నుండి ప్రారంభం : నిర్మాత బెక్కెం వేణుగోపాల్

హీరో శ్రీవిష్ణు నటిస్తున్న పోలీస్ ఆఫీసర్ ఫిక్షనల్ బయోపిక్‌ ‘అల్లూరి’. నిజాయితీకి మారు పేరు అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రానికి నిర్మిస్తున్నారు. బెక్కెం బబిత సమర్పిస్తున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు నిజాయితీ గల పోలీసు అధికారి అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఈ అల్లూరి సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలౌతున్న నేపధ్యంలో నిర్మాత బెక్కెం వేణుగోపాల్ విలేఖరుల సమావేశం నిర్వహించి సెప్టెంబర్ 3 నుండి అల్లూరి టీం యాత్రని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రెస్ మీట్ కి ఆయన పోలీస్ డ్రెస్ లో రావడం ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. లక్కీ మీడియా బ్యానర్ స్థాపించి 15 ఏళ్ళయ్యింది. మీ అందరి సహకారంతో విజయాలు సాధిస్తూ ముందుకు వచ్చాను. ఈ ప్రయాణంలో ఎక్కువ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కి ప్రాధన్యత ఇచ్చాను. మంచి కంటెంట్ తో యాక్షన్ సినిమా తీయాలని వుండేది. అలాంటి సమయంలో ప్రదీప్ వర్మ ‘అల్లూరి’ కథ చెప్పారు. ‘అల్లూరి’ పేరు వింటేనే ఒక పవర్ వస్తుంది. అంతే పవర్ ఫుల్ స్టొరీ ఇది. ఎవరికైనా పోలీసు అవ్వాలని వుంటుంది. నేను చిన్నప్పుడు పోలీస్ అవ్వాలని అనుకున్నాను. ‘అల్లూరి’ సినిమా చాలా ఎమోషనల్ గా ఇష్టంగా చేశాను. సినిమాపై వున్న ప్రేమ గౌరవంతోనే మీముందుకు పోలీస్ డ్రెస్ తో వచ్చాను. ‘అల్లూరి’ షూటింగ్ నిన్నటితో పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో వున్నాయి. సెప్టెంబర్ 23 సినిమా విడుదలౌతుందని ముందే ప్రకటించాం. రేపటి నుండి సినిమాకి సంబంధించిన పాటలు వరుసగా విడుదల చేసి పదిరోజుల తర్వాత ట్రైలర్ విడుదల చేస్తాం. సెప్టెంబర్ 3 నుండి వైజాగ్ లో అల్లూరి సీతారామారాజు గారి సమాధి దగ్గర నుండి హీరో గారితో పాటు సినిమా యూనిట్ అంతా కలసి యాత్రని ప్రారంభిస్తున్నాం. అన్ని ప్రాంతాల్లో టూర్ చేసి పోలీసులు అధికారులకు సన్మానం చేస్తూ పబ్లిక్ తో కలుస్తూ 12 రోజుల పాటు టూర్ ప్లాన్ చేశాం. వైజాగ్ లో మొదలైన టూర్ వరంగల్ నిజామాబాద్ వరకూ కొనసాగుతుంది. టూర్ ముగిసిన తర్వాత ప్రీరిలీజ్ ఈవెంట్ చేసి సినిమాని గ్రాండ్ విడుదల చేస్తాం. మేము నిర్మించిన ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతోనే శ్రీవిష్ణు నటుడిగా పరిచమయ్యారు. అంచెలంచలుగా ఎదిగి గొప్ప స్థాయికి చేరుకున్నాడు. ‘అల్లూరి’ సినిమాలో చాలా ఇంటెన్స్ గా చేశాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాలో శ్రీవిష్ణు విశ్వరూపం చూస్తారు. శ్రీవిష్ణు కెరీర్ లో అల్లూరి బెస్ట్ మూవీ అవుతుంది. దర్శకుడు ప్రదీప్ వర్మ చాలా గొప్పగా తీశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. మిగతా సాంకేతిక నిపుణులంతా అద్భుతంగా పని చేశారు. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు” తెలిపారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు,

పోలీస్ గెటప్ లో రావడానికి కారణం.? సినిమా ప్రమోషన్స్ లో ఇది భాగమేనా ?

పోలీస్ అంటే ప్రేమ, గౌరవం. నాకు పోలీస్ డ్రెస్ వేసుకునే అవకాశం వచ్చింది. టూర్ గురించి చెబుతున్నపుడు ఇలా పోలీస్ డ్రెస్ వేసుకొని చెప్తే బావుంటుందని అనిపించింది. అందుకే ఇలా రావడం జరిగింది. పోలీస్ వృత్తి పై ప్రేమతో ఇలా వచ్చినా సినిమా ప్రమోషన్స్ లో ఇదీ ఒక భాగమే అనుకోవచ్చు.

చాలా పోలీస్ కథలు వచ్చాయి కదా.. అల్లూరిలో వుండే వైవిధ్యం ఏమిటి ?

ఒక పోలీస్ జీవిత ప్రయాణం ఇందులో చూపిస్తున్నాం. వృత్తితో పాటు వ్యక్తిగత జీవితం కూడా ఆసక్తికరంగా వుంటుందది. ఇందులో చాలా ఎమోషనల్ డ్రైవ్ వుంటుంది. సినిమా పూర్తయ్యేసరికి ప్రతి ఒక్కరికి పోలీస్ వృత్తిపై ఎనలేని గౌరవం ఏర్పడుతుంది.

మీ సినిమాలు చిన్న బడ్జెట్ తో పెద్ద సక్సెస్ కొట్టాయి..అల్లూరి మీ బ్యానర్ కి పెద్ద బడ్జెట్ సినిమా అనుకోవచ్చా ?

సినిమా చేస్తున్న క్రమంలో బడ్జెట్ పెరిగింది. అయితే వృధా కాలేదు. ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది. ఆడియన్స్ కి గొప్ప అనుభవం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేశాం. ప్రేక్షకులకు మంచి థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా అల్లూరి. సినిమా చూపిస్తా మామా, నేను లోకల్ అంత పెద్ద కమర్శియల్ సక్సెస్ ఈ సినిమాతో వస్తుందని ఆశిస్తున్నా.

మీకు నిర్మాత దిల్ రాజు గారి సపోర్ట్ ఎక్కువ కదా.. అల్లూరికి కూడా ఆయన సపోర్ట్ ఉందా ?

దిల్ రాజు గారి సపోర్ట్ ఎప్పుడూ వుంటుంది. అల్లూరికి కూడా ఆయన సపోర్ట్ వుంది. ఆయనకి కథ నచ్చింది. వారం రోజుల్లో ఆయనకి సినిమా చూపించబోతున్నా.

ఈ మధ్య షూటింగ్స్ నిలిపివేయడం వలన ఏదైనా మేలు జరిగిందని భావిస్తున్నారా ?

గత 25 రోజుల జరుగుతున్న మీటింగ్స్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగాయి. చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి. మీటింగ్స్ లో తీసుకున్న నిర్ణయాలు త్వరలోనే వెళ్ళడిస్తాం.

కొత్తగా చేయబోతున్న చిత్రాలు ?

బూట్ కట్ బాలరాజు అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేస్తున్న.

తారాగణం: శ్రీవిష్ణు, కయ్యదు లోహర్, తనికెళ్ల భరణి, సుమన్, మధుసూధన్ రావు, ప్రమోదిని, రాజా రవీంద్ర, పృధ్వీ రాజ్, రవివర్మ, జయ వాణి, వాసు ఇంటూరి, వెన్నెల రామారావు, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు.

సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం: ప్రదీప్ వర్మ

నిర్మాత: బెక్కెం వేణుగోపాల్

బ్యానర్: లక్కీ మీడియా

సమర్పణ: బెక్కెం బబిత

ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డే

సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్

డీవోపీ: రాజ్ తోట

ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల

ఆర్ట్ డైరెక్టర్: విఠల్

ఫైట్స్: రామ్ క్రిషన్

సాహిత్యం: రాంబాబు గోసాల

సౌండ్ ఎఫెక్ట్స్: కె రఘునాథ్

పీఆర్వో: వంశీ-శేఖర్

Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES