HomeTelugu`బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్` సెప్టెంబర్ 30న విడుదల

`బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్` సెప్టెంబర్ 30న విడుదల

విశ్వంత్ దుద్దుంపూడి, మాళవిక స‌తీష‌న్ హీరోహీరోయిన్లుగా సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్టైనర్ `బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్“. స్వస్తిక సినిమా, ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌పై వేణుమాధవ్‌ పెద్ది, కె. నిరంజన్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా పై క్యురియాసిటీని పెంచింది. మధునందన్, సుదర్శన్, హర్ష వర్ధన్ ఇందులో కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుంద‌ర్‌ సంగీతం అందిస్తుండగా, బాల స‌ర‌స్వతి సినిమాటోగ్రఫర్ గా, విజ‌య్ వ‌ర్ధన్‌ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

తారాగ‌ణం:
విశ్వంత్ – మాళ‌విక స‌తీష‌న్‌- పూజా రామ‌చంద్రన్‌- హ‌ర్షవ‌ర్ధన్‌- నెల్లూరు సుద‌ర్శన్- మధునంద‌న్‌, అమృతం అప్పాజీ- రాజా ర‌వీంద్ర- రూప ల‌క్ష్మి

సాంకేతిక‌వ‌ర్గం:
ర‌చ‌న, ద‌ర్శక‌త్వం: సంతోష్ కంభంపాటి
నిర్మాత‌లు: వేణు మాధ‌వ్ పెద్ది, కె. నిరంజ‌న్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: అశ్రిన్ రెడ్డి
సంగీతం: గోపి సుంద‌ర్‌
సినిమాటోగ్రఫి: బాల స‌ర‌స్వతి
ఎడిట‌ర్‌: విజ‌య్ వ‌ర్ధన్‌. కె
లిరిక్స్‌: ర‌హ‌మాన్‌, రాకేందుమౌళి
కొరియోగ్రాఫ‌ర్‌: విజ‌య్ ప్రకాశ్‌

పిఆర్ఓ: వంశీ- శేఖ‌ర్

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES