వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్న వర్సటైల్ హీరో సత్యదేవ్ లేటెస్ట్ మూవీ ‘కృష్ణమ్మ’ . ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై వి.వి.గోపాల కృష్ణ దర్శకత్వంలో కృష్ణ కొమ్మలపాటి.. కృష్ణమ్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే మూవీని థియేటర్స్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
కాల భైరవ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా నుంచి శుక్రవారం చిత్ర యూనిట్ ‘ఏమవుతుందో మనలో..’ అనే మెలోడి సాంగ్‌ను పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడారు. పాటను గమనిస్తే ప్రేమలో గాఢతను తెలియజేసేలా ఉంది. మనసులోని భావాలను ప్రేమికులు బయటకు వ్యక్తం చేయలేనప్పుడు మనసులతో ఊసులాడుకుంటారనేలా హవ భావాలను చక్కటి పదాలను వ్యక్తిం చేశారు. పాట మనసుకి హత్తుకుంటోంది. సన్ని కొర్రపాటి విజువల్స్ పాటకు మరింత అందాన్ని తెచ్చి పెట్టాయి.
రీసెంట్‌గా విడుదలైన ‘కృష్ణమ్మ’ సినిమా టీజర్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. సత్యదేవ్ యాక్టింగ్‌లోని ఇన్‌టెన్సిటీ సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయి.