HomeTelugu'సీతారామం'కు చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రేక్షకులకు పాదాభివందనం : చిత్ర యూనిట్

‘సీతారామం’కు చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రేక్షకులకు పాదాభివందనం : చిత్ర యూనిట్


స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన కీలక పాత్రలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన క్లాసిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ నేపధ్యంలో ‘సీతారామం’కు చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర యూనిట్ ‘సీతారామం’ థాంక్ యూ మీట్ నిర్వహించింది. కింగ్ అక్కినేని నాగార్జున ఈ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

నాగార్జున మాట్లాడుతూ.. అశ్వినీదత్ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన కంటే నేను ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు స్వప్న, ప్రియాంక. వాళ్ళిద్దరూ నాకు చిన్నప్పటి నుండి తెలుసు. దత్ గారికి వారిద్దరూ పెద్ద అండ. మహానటి, జాతిరత్నాలు, ఇప్పుడు సీతారామం .. వరుసగా అద్భుతమైన విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. వైజయంతి బ్యానర్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చూసుకుంటున్న స్వప్న, ప్రియాంకకి కృతజ్ఞతలు. వైజయంతి బ్యానర్ లో ఐదు సినిమాలు చేశాను. సీతారామం చిత్రాలని గొప్పగా ఆదరించారు. మంచి సినిమా తీస్తే చూస్తామనే నమ్మకం ఇచ్చారు.సీతారామంకు రోజు రోజుకి ఆదరణ పెరుగుతుందని స్వప్న చెప్పడం ఆనందంగా వుంది. అశ్విని దత్ గారు సినిమా థియేటర్ కి మళ్ళీ ఆడియన్స్ ని తీసుకొచ్చి మా అందరికీ మళ్ళీ నమ్మకం కలిగించారు. సీతారామంను ఇంత గొప్ప ఆదరించిన ప్రేక్షకులకులందరికీ మరోసారి కృతజ్ఞతలు” తెలిపారు.

దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ‘సీతారామం’ని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాపై ప్రేక్షకుల చూపిస్తున్న ఆదరణ మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతిని ఇస్తుంది. స్వప్న దత్ అద్భుతమైన నిర్మాత. తనకి అసాధ్యం అంటూ ఏమీ వుండదు. మహానటి, ఇప్పుడు సీతారామం.. నా కోసం ఎప్పుడూ ప్రత్యేకమైన కథలే ఎంపిక చేస్తారు స్వప్న. అశ్విని దత్ గారు నా అభిమాన వ్యక్తి.
మృణాల్ లాంటి నటితో పని చేయడం ఆనందంగా వుంది.

దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. గత 5వ తేది నుండి ఒక ఊహప్రపంచంలో బ్రతుకున్నట్లుగా వుంది. మాటల్లో చెప్పలేని అనుభూతి ఇది. నాలుగు సినిమాలు తీశాను. కానీ ఇప్పుడింత ఆదరణ లేదు. మొదటిసారి ఈ ఆదరణ చూస్తున్న. ఇప్పటికీ మర్చిపోలేని ఫీలింగ్ ఇది. ‘సీతారామం’ నాకు బాగా దగ్గరైన కథ. ‘సీతారామం’ కథ దృశ్య రూపంలోకి మారడానికి చాలా మంది కృషి వుంది.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES