సాయిధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కె.వి. ధీరజ్, నవకాంత్, చమ్మక్ చంద్ర ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం `షికారు` శ్రీసత్యసాయిబాబాగారి ఆశీస్సులతో నాగేశ్వరి (పద్మ) సమర్పణలో పి.ఎస్.ఆర్. కుమార్ (బాబ్జీ, వైజాగ్) నిర్మాతగా శ్రీసాయి లక్ష్మీ క్రియేషన్స్ బేనర్‌మీద హరి కొలగాని దర్శకత్వంలో రూపొందింది. (యాన్ అన్‌లిమిటెడ్ ఫన్ రైడ్) అనేది ట్యాగ్‌లైన్. శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాయి. ఇటీవలే చిత్ర యూనిట్ వైజాగ్ నుంచి నెల్లూరువరకు రోడ్‌ట్రిప్ నిర్వహించింది. ప్రతిచోట యూత్ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆ విశేషాలను, చిత్ర విడుదల తేదీని తెలియజేస్తూ, చిత్ర యూనిట్ ఆదివారంనాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
సాయిధన్నిక మాట్లాడుతూ, అందరి సమిష్టి కృషితో మన సినిమాగా పనిచేశాం. షికారు చిత్రానికి మొదట శ్రీకారం చుట్టింది బెక్కెం వేణుగోపాల్‌గారు. నా పేరు దర్శకుడు హరి సూచిస్తే, అందుకు సపోర్ట్ చేసింది ఆయనే. మంచి కథతో షికారు ద్వారా తెలుగువారి ముందుకు వస్తున్నా. మొదట తమిళ అమ్మాయికి తెలుగువారి సపోర్ట్ ఎలా వుంటుందనే సందేహం వుండేది. కానీ ఇక్కడకు వచ్చాక అంతా పోయింది. దర్శకుడు నాకు అందమైన పాత్ర ఇచ్చారు. ఆయనకు సినిమాపై మంచి క్లారిటీ వుంది. నిర్మాత బాబ్జీగారు కుటుంబసభ్యుల్లా అందరినీ చూసుకున్నారు. ప్రచారంలో భాగంగా వైజాగ్ నుంచి నెల్లూరు వరకు రోడ్ ట్రిప్‌లో ఎంతో సంతోషం కలిగింది. శేఖర్ చంద్ర బాణీలు బాగా పాపులర్ అయ్యాయి. `ఫ్రెండ్ తోడు వుండగా` పాట కాలేజీలో యూత్‌కు బాగా చేరింది. కరణ్ సంభాషణలు, శ్యామ్ ఫొటోగ్రఫీ హైలైట్‌గా నిలుస్తాయి. ధీరజ్, నవకాంత్ ,అభినవ్, తేజ, గాయత్రి ఇలా అందరూ మంచి పాత్రలు చేశారు. జులై1 సినిమాను చూడండి అని తెలిపారు.
నటుడు, నిర్మాత డి.ఎస్. రావు మాట్లాడుతూ, జోరుగా హుషారుగా మా `షికారు`టీమ్ వైజాగ్ నుంచి నెల్లూరు వరు కాలేజీ టూర్ వేసింది. ఎంతో స్పందన వచ్చింది. మా ప్రచారానికి వచ్చిన సాయిధన్సికకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దర్శకుడు చెప్పిన కథ నచ్చి బాబ్జీగారు సినిమా తీశారు. ఆయన ఆలోచనలకు తగినట్లుగా కథ వుంది. ముందుగా జూన్ 24న విడదుల అనుకున్నాం. కానీ థియేటర్‌లో అందరూ చూడాలని జులై1న విడుదలకు మారాం. ఈ సినిమా మంచి సక్సెస్ ఇస్తుంది. ఈ సినిమాతో సాయిధన్సికతోపాటు నలుగురు కుర్రాళ్ళకు మంచి లైఫ్ రావాలని కోరుకుంటున్నానని అన్నారు.
దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, షికారు సినిమాను బాబ్జీగారు తీద్దామని అనుకుంటున్నప్పటినుంచీ ప్రతి విషయాన్ని నాతో షేర్ చేసుకునేవారు. 12 ఏళ్ళుగా ఆయన నాకు తెలుసు. ఈ సినిమా కథలో మంచి హ్యూమర్ వుంది. చివరిలో చిన్న సందేశం కూడా వుంది. నేను కామెడీ సినిమాలు చేశాను. నాకు బాబ్జీగారు లైన్ చెప్పగానే నాకు ఎందుకు ఈ ఐడియా రాలేదు అనిపించింది. దర్శకుడు బాగా ఆలోచించాడు. ఆయనకు మంచి పేరువస్తుంది. పంపిణీదారుడిగా, ఎగ్జిబిటర్‌గా ఆయన ఎన్నో సినిమాలు చేశారు. ఈ సినిమా టేబుల్ ఫ్రాఫిట్ అన్నారు. నిర్మాత బాబ్జీగారికి మంచి కలెక్షన్లు వచ్చి మరిన్ని సినిమాలు తీయడానికి నాంది కావాలని కోరుకుంటున్నానని అన్నారు.
మరో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ, బాబ్జీగారికున్న అనుభవంతో ప్రేక్షకుడికి ఏం కావాలో తెలుసుకుని సినిమా చేశారు. ఆయన ఫైనాన్సియర్ కూడా. అందుకే మంచి సినిమా కోసం వేచిచూసి ఈ సినిమా తీశారు. జూలై1న రాబోతున్న ఈ సినిమా అందరికీ మంచి పేరు తేవాలని కోరుతున్నానని అన్నారు.
ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, బాబ్జీగారు పంపిణీదారుడిగా బాగా ఆలోచించి పిల్ల జమిందారు వంటి సినిమాను విడుదలచేసి హిట్ కొట్టారు. అలా 630 సినిమాలు చేసి వియవంతమైన డిస్ట్రిబ్యూటర్‌గా పేరుపొందారు. దర్శకుడు హరిని మేం దర్శకుడిని చేయాలనుకున్నటైంలో బాబ్జీగారు పసిగట్టి ముందుగానే చేసేశారు. ఆ తర్వాత షికారు టైటిల్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా వేరువారి దగ్గర వున్న టైటిల్‌ను వారినుంచి ఒప్పించి తన సినిమాకు బాగా సూటవుతుందని బాబ్జీగారు దక్కించుకున్నారు. ఈ సినిమా బిజినెస్ పరంగా సేఫ్ అంటే క్రెడిట్ మొత్తం యూనిట్‌కు వస్తుంది. సాయిధన్సిక ప్రమోషన్‌కు సహకరించడం చాలా అభినందనీయం. మిగతా హీరోయిన్లు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. శేఖర్ చంద్ర సంగీతం సినిమాకు ప్రాణం. షర్మిల ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేయడం అభినందనీయం. ఈ సినిమా సూపర్‌హిట్ కావాలని కోరుకుంటున్నానని తెలిపారు.
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ, షికారు మూవీ దర్శకుడు హరి నాకు లైన్‌గా చెప్పాడు. ఐడియా చాలా నచ్చింది. కమర్షియల్ హిట్ అనిపించింది. బాబ్జీగారు సినిమా చేయాలనుకొనే టైంలో ఈ కథ విని ఎనిమిది నెలలు కష్టపడి తీర్చిదిద్దారు. కబాలి చూశాక ధన్సిక కరెక్ట్ అని భావించి ఎంచుకున్నారు. ఆమె రాకతో ఈ సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. తొలి కాపీ చూశాను. చాలా బాగుంది. ఈ సినిమాను చూపించి అమ్ముదామని బాబ్జీగారు నిర్ణయం తీసుకున్నారు. అలా చూసి పెద్ద సంస్థలు ముందుకు వచ్చాయి. యూత్‌కు పైసా వసూల్ సినిమా. జులై 1న చూసి ఆనందించండి. ఇందులో సర్ ప్రైజ్ ఎలిమెంట్ కూడా వుంది. ఇందులో నటించిన అందరికీ మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు.
నటుడు రచ్చ రవి మాట్లాడుతూ, నిర్మాత బాబ్జీగారు 650 సినిమాలు పంపిణీదారుడిగా చేసిన అనుభవంతో ఈ సినిమా తీశారు. ఈ కథలో నలుగురు హీరోలు మంచి పాత్రలో నటించారు. కబాలీలో రజనీకాంత్ కూతురుగా చేసిన సాయిధన్సిక చేయడంతోనే సగం సక్సెస్ వచ్చేసింది. కథగా చెప్పాలంటే ఓ తుంటరి కథ. యూత్ ఎడాప్ట్ చేసుకుంటారు. వైజాగ్ నుంచి నెల్లూరు వరకు జరిగిన యాత్రలో యూత్ ఎంతో రిసీవ్ చేసుకున్నారు. భాస్కరభట్ట పాటలు యూత్‌కు చేరాయి. జులై 1న అందరూ చూసి ఆనందించండి అన్నారు.
నిర్మాత బాబ్జీ మాట్లడుతూ, `షికారు` అన్‌లిమిటెడ్ ఫన్ రైడ్. అనేది తెరపై బాగా కనిపిస్తుంది. ఏ సినిమాలోనైనా కామెడీలేకపోతే ఉప్పులేని కూరలా వుంటుంది. అందుకే కామెడీకి నేను ప్రాధాన్యత ఇస్తాను. నా దగ్గర చాలా కథలు వున్నాయి. కానీ హరి చెప్పిన ఈ పాయింట్ నచ్చడంతో వెంటనే సినిమా తీశాను. ముందుగా జూన్ 24న విడుదలతేదీ అనుకున్నాం. కానీ ఆరోజు చాలా సినిమాలు విడుదల కావడంతో థియేటర్‌లో అందరూ చూడాలనే జూలై1న వస్తున్నాం. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ న్యాయం చేశారు. సాయిధన్సిక అభినయం అద్భుతంగా ఉంది. ఇందులో మంచి కంటెంట్ వుంది. రచయిత కరుణ, శ్యామ్ ఫొటోగ్రఫీ, శేఖర్ చంద్ర సంగీతం బాగా కుదిరాయి. ఆర్.ఆర్. అద్భుతంగా ఇచ్చారు. సినిమాను చూసి నమొదటి ప్రేక్షకుడు ఆయనే. చూశాక మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చాడు. ఆయన చెప్పిన మాట మాకు బలాన్ని ఇచ్చింది. నాగేశ్వరరెడ్డిగారికి కథ చెప్పాను. ఎంతో ప్రోత్సహించారు. దిల్‌రాజు, సురేష్‌బాబు ఇలా పెద్దల సహకారంతో జులై 1న థియేటర్లలో రాబోతున్నాం. సాయిధన్సిక సపోర్ట్ మర్చిపోలేనిది. ఈ సినిమా ఆడియన్స్ అలరిస్తుందనే నమ్మకముందని తెలిపారు.
నటుడు నవకాంత్ మాట్లాడుతూ, సినిమా విడుదలకుముందు టెన్షన్ వుంది. కానీ ప్రమోషన్‌కు వెళ్ళాక అదంతా పోయింది. ఈ సినిమా ఫుల్ కామెడీనేకాదు. ఉగాది పచ్చడిలా అన్ని అంశాలుంటాయి. జులై 1న అందరూ చూడండి అని కోరారు.
నటుడు ధీరజ్ ఆత్రేయ మాట్లాడుతూ, ఇతకు ముందు షార్ట్ ఫిలిం చేశాను. ఈ సినిమాలో నా పాత్రలో రెండు షేడ్స్ వుంటాయి. ఒక షేడ్‌లో బాలయ్యబాబు అభిమానిగా చేశాను. అది బాలయ్యబాబు ఫ్యాన్స్‌కు అంకితంగా వుంటుంది. విడుదల తర్వాత మా చిన్న సినిమా పెద్ద సినిమా అవుతుందని చెప్పగలను అని చెప్పారు.
దర్శఖుడు హరి కొలగాని మాట్లాడుతూ, నాకు గురువులు శ్యామ్ ప్రసాద్ రెడ్డిగారు, సురేష్ బాబుగారు. సురేష్‌బాబు సినిమాను విడుదల చేయడం ఆనందంగా వుంది. మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సినిమా తీశాం. మేం జూలై 1 వస్తున్నాం. నా బలం టెక్నీషియన్స్. అందరూ బాగా ఔట్‌పుట్ ఇచ్చారు. అందరికంటే బాబ్జీగారికి థ్యాంక్స్ చెప్పాలి. నెలక్రితం టెన్షన్‌గా వున్నాను. ప్రజలకు సినిమా గురించి తెలసోలేదో అనుకున్నాను. కానీ ప్రమోషన్ లో భాగంగా పర్యటించినప్పుడు ఆ టెన్షన్ పూర్తిగా పోయింది. అందుకు నిదర్శనం ఈ సినిమాకు మంచి బిజినెస్ అవ్వడమే. కామెడీలో అరాచకం ఎలా వుండబోతుందో మా షికారు సినిమా చూపిస్తుంది అని అన్నారు.
సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మాట్లాడుతూ, బెక్కెం వేణుగోపాల్‌గారితో పలు సినిమాకు పనిచేశాను. అప్పుడే బాబ్జీగారు పరిచయం ఆయన దేనికీ కాంప్రమైజ్ కారు. నాగేశ్వరరెడ్డిగారుకూడా ప్రతిపాట విని ఫీడ్ బ్యాక్ వినడం మాకు ఎనర్జీ ఇచ్చారు. బాబ్జీగారు మంచి మనిషి. నేను కథ విన్నాక చాలా ఎంజాయ్ చేశాను. ఇందులో నటించిన నలుగురు కుర్రాళ్ళకు మంచి పేరు వస్తుంది. సాయిధన్సికకు మంచి పేరు వస్తుంది. భాస్కరభట్ట పాటలుబాగా రాశారు. సిద్ద్ శ్రీరామ్, ధనుంజయ్, సాయిచరణ్ బాగా ఆలపించారు. జూలై1 అందరూ చూడండి అని తెలిపారు.
ఆర్ట్ డైరెక్టర్ షర్మిల మాట్లాడుతూ, ఈ సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా వుంది. నన్ను ఆర్ట్ డైరెక్టర్ గా ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని అన్నారు.
ఫిలింఛాంబర్ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ మాట్లాడుతూ, ఈ సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు.
PRO,
Tejaswi Sajja