HomeTeluguలెహ‌రాయి' మూవీ నుండి "మెరుపై మెరిసావే .." సెకండ్ సింగిల్ ని విడుద‌ల చేసిన...

లెహ‌రాయి’ మూవీ నుండి “మెరుపై మెరిసావే ..” సెకండ్ సింగిల్ ని విడుద‌ల చేసిన ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ


వ‌రుస విజ‌యాలు త‌న ఖాతాలో వేసుకుని త‌న‌కంటూ తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌త్యేఖమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న‌ నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో యంగ్ టాలెంటెడ్ హీరో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా , ధ‌ర్మ‌పురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్,అలీ ముఖ్య‌తారాగాణం గా, ప్రముఖ ద‌ర్శ‌కుల వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ లో ప‌నిచేసిన రామకృష్ణ పరమహంస ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం చేస్తూ ఫ్యాష‌న్ తో సినిమా రంగంలోకి అడుగెట్టిన మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం “లెహరాయి. ఈ చిత్రం యొక్క టైటిల్ చాలా ఫ్యామ‌స్ కావ‌టం విశేషం. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జ‌రుపుకుంటుంది. నువ్వు ఏడికొస్తే ఆడికెల్తా సువ‌ర్ణ నీ ఇంటి పేరు మారుస్తా సువ‌ర్ణ అంటూ 90 స్ లో ట్రెండింగ్ మ్యూజిక్ ద‌ర్శ‌కుడు ఘంటాడి కృష్ణ ఈ చిత్రం తో జికే ఈజ్ బ్యాక్ అన్న‌ట్టు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి విడుద‌ల‌య్యిన “గుప్పెడంత” సాంగ్ ఆర్గానిక్ గా మిలియ‌న్ ప్లస్ వ్యూస్ రావ‌టం, ఆ సాంగ్ ని వందల్లో రీల్స్ చేయ‌టం… 45 మిలియన్స్ లో ప్లే కావడం ఈ సాంగ్ పాపులారిటి తెలుస్తుంది. ఈ స‌క్స‌స్ ని పురస్క‌రించుకుని లెహ‌రాయి చిత్రం నుండి రెండ‌వ సాంగ్ ని విడుద‌ల చేశారు. ఈ సాంగ్ ని యావ‌త్ సౌత్ ఇండియాని ఊపేస్తున్న టాలెంటెడ్ ట్రెండి సింగ‌ర్ సిధ్ధ్ శ్రీరామ్ ఆల‌పించారు. ఈ సాంగ్ ని వ‌రుస విజ‌యాల‌తో ఏమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీస్ తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న శివ నిర్వాణ చేతుల మీదుగా విడుద‌ల చేసారు.

శివ నిర్వాణ మాట్లాడుతూ.. ఈ చిత్రం లో రెండ‌వ సాంగ్ ని నేను విడుద‌ల చేయ‌టం చాలా ఆనందంగా వుంది. సిద్ధ్ శ్రీరామ్ సాంగ్ పాడితే చాలు చార్ట్‌బ‌స్ట‌ర్ లో నెంబ‌ర్ వ‌న్ పోజిష‌న్ లో వుంటుంది. ఈ సాంగ్ కూడా త‌ప్ప‌కుండా నెంబ‌ర్ వ‌న్ పోజిష‌న్ కి వెలుతుంది. మ్యూజిక్ డైర‌క్ట‌ర్ జికే గారు అందించిన చాలా పాటలు అప్ప‌ట్టో యూత్ అంతా పాడుకునేవారు. యూత్ ని ఆక‌ర్షించే ట్యూన్స్ ఇవ్వ‌డం లో ఆయ‌న‌కి ఆయ‌నే సాటి మ‌ళ్ళి ఈ చిత్రం ద్వారా క‌మ్ బ్యాక్ రావ‌డం చాలా ఆనందం గా వుంది. , క్యాచి లిరిక్స్ తో హ‌మ్మింగ్ ట్యూన్ తో చాలా బాగుంది. ద‌ర్శ‌కుడు రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస కి, మ్యూజిక్‌ ద‌ర్శ‌క‌డు జికే కి , రామ‌జోగ‌య్య శాస్ట్రి గారికి నిర్మాత శ్రీనివాస్ గారికి, న‌టీన‌టుల‌కి మ‌రియు నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారికి నా ప్ర‌త్యేఖ‌మైన అభినంద‌న‌లు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత మ‌ద్దిరెడ్డి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. స‌క్సస్ లో వున్న ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ గారు చేతుల మీదుగా మా రెండ‌వ సాంగ్ విడుద‌ల కావ‌టం చాలా ఆనందంగా వుంది ఆయ‌న‌కి మా ప్ర‌త్యేఖ‌మైన ధ‌న్య‌వాదాలు. మా నిర్మాత బెక్కం వెణుగొపాల్ గారు స‌మ‌ర్ప‌ణ‌లో మా లెహ‌రాయి చిత్రం ప్ర‌మొష‌న్స్ చాలా బాగా జ‌రుగుతున్నాయ‌. మొద‌టి సాంగ్ కి . చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు మా రెండ‌వ సాంగ్ కూడా ఆక‌ట్టుకొవ‌డం చాలా ఆనందం గా వుంది. ఈ సాంగ్ ని జికే గారు ఆయ‌న సాంగ్స్ కి ఏమాత్ర త‌గ్గ‌కుండా కంపోజ్ చేశారు, సిధ్ద్ శ్రీరామ్ గారు పాడ‌టం ఈ సాంగ్ మొద‌టి స‌క్స‌స్ గా భావిస్తున్నాను. ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి త్వ‌ర‌లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల మందుకు తీసుకువ‌స్తాము.. అని అన్నారు ద‌ర్శ‌కుడు రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస మాట్లాడుతూ.. మొరుపై మొరిసావే..వ‌ర‌మై క‌లిసావే..గుండే గిల్లి వేల్లావే అనే యూత్ ఫుల్ సాంగ్ ని ఈ రోజు శివ నిర్మాణ చేతుల మీదగా లాంచ్ చేశాము. ఈ సాంగ్ అంద‌ర్ని ఆక‌ట్ట‌కుంటుంది. జికే గారు మ్యూజిక్ మెస్మ‌రైజ్ చేస్తుంది. సిధ్ధ్ శ్రీరామ్ గారు పాడిన ఈ పాట చాలా చ‌క్క‌గా హ‌యిగా వుంటుంది. విన్న ప్ర‌తిఒక్క‌రూ ఈ సాంగ్ ని త‌మ మొబైల్ లో రిపీట్ గా వింటారు.

TIPS మ్యూజిక్ ద్వారా విడుదల కాబోతున్న ఈ చిత్రం లో మొత్తం 7 సాంగ్స్ వున్నాయి. ప్ర‌తిసాంగ్ అల‌రించే విధంగా వుంటుంది. మంచి ఫీల్ వున్న క‌థ లో చిత్రాన్ని తెర‌కెక్కించాను. త్వ‌ర‌లో రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేస్తాము. ప్ర‌ముఖులు న‌టించిన ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత బెక్కం వేణుగొపాల్ గారు స‌మ‌ర్పించ‌డం చాలా ఆనందం గా వుంది.. అన్నారు. లెహ‌రాయి చిత్రం మొద‌టి పాట విడుద‌ల త‌రువాత ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ సిరి వేంక‌టేశ్వ‌ర సినిమాస్ అధినేత రవికుమార్ రెడ్డి పోతం వారు ఫ్యాన్సి రేట్ కి కొనుగొలు చేయ‌టం విశేషం నటీనటులు రంజిత్, సౌమ్య మీనన్,గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్,అలీ,సత్యం రజెష్,జబర్దస్త్ రాంప్రసాద్ తదితరులు సాంకేతిక నిపుణులు ప్రజెంట్ : బెక్కం వేణుగోపాల్ బ్యానర్ : ఎస్ ఎల్ ఎస్ మూవీస్ సినిమా : “లెహరాయి” నిర్మాత : మద్దిరెడ్డి శ్రీనివాస్ రైటర్, డైరెక్టర్ : రామకృష్ణ పరమహంస మ్యూజిక్ : జీకే (ఘంటాడి కృష్ణ) డి.ఓ.పి : ఎం ఎన్ బాల్ రెడ్డి ఎడిటర్ : ప్రవీణ్ పూడి లిరిక్ రైటర్స్ :;రామజోగయ్య శాస్త్రి, ఫైట్ మాస్టర్ : శంకర్ కొరియోగ్రాఫర్స్ : అజయ్ సాయి రైటర్ : పరుచూరి నరేష్ పి ఆర్.ఓ : ఏలూరు శీను, మేఘశ్యామ్

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES