ప్రతాని రామకృష్ణ గౌడ్ సమర్పణ లో మౌంట్ ఎవరెస్ట్ పతాకంపై ఫిరోజ్ ఖాన్,సనా ఖాన్, సంహిత విన్య, ఐశ్వర్య, మిలింద్ గునాజీ, మేకా రామకృష్ణ,అనంత్ నటీ నటులుగా షేర్ దర్శకత్వంలో మిన్ని నిర్మిస్తున్న ,హార్రర్, సస్పెన్స్ యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ “యు ఆర్ మై హీరో ” అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 17 న విడుదల అవుతున్న సందర్భంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో సినీ అతిరదుల సమక్షంలో ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, TSIIC చైర్మన్ బాలమల్లు, గజ్జెల నగేష్, నిర్మాత మౌసమ్, నిర్మాత అసిఫ్,నటి రష్మీ ఠాగూర్, షి టీం లక్ష్మి, నిర్మాత సత్యనారాయణ లుముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఆనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..గతంలో సినిమా అనేది కొన్ని కుటుంబాలకే పరిమితం ఉండేది. తెలంగాణ ఆర్టిస్టులు ఉన్నా వారికి సరైన అవకాశం ఇచ్చేవారు కాదు. అలాంటిది ఇప్పుడు తెలంగాణ వచ్చిన తరువాత ఇక్కడ ఆర్టిస్టులకు అవకాశాలు లభిస్తున్నాయి. ఒకప్పుడు తెలంగాణ బాషను పట్టించుకొనే వారు కాదు. కానీ ఇప్పుడు సినిమాలో తెలంగాణ బాష ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. తెలంగాణ లో మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి షూటింగ్ చేసుకోవడానికి మా టూరిజం నుండి అనేక సౌకర్యాలు కలిపిస్తాము కాబట్టి సమాజానికి మంచి మెసేజ్ ఉన్న సినిమాలు తియ్యాలని కోరుతున్నాను. రామకృష్ణ గౌడ్ గారికి సినిమా అంటే పిచ్చి. తను అన్ని వదులుకొని సినిమాకె పరిమితం అయ్యి ఎంతోమందికి సహాయ పడుతున్నాడు. వారికీ మా ధన్యవాదములు.. సినీ ఇండస్ట్రీ లో చాలా మంది ట్యాలెంట్ ఉన్న వారు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాంటి ట్యాలెంట్ తో డైరెక్టర్ గా వచ్చిన షేర్ మరిన్ని మంచి చిత్రాలు తీయాలని కోరుతూ ఈ నెల 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “యు ఆర్ మై హీరో” చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.
TSIIC చైర్మన్ బాలమల్లు మాట్లాడుతూ..,దర్శకుడు షేర్ తెలంగాణ బిడ్డ. మా నియోజకవర్గం లో 10 సినిమాలు చేసిన దర్శకుడు ఉండడం చాలా సంతోషంగా ఉంది.తను ఇంకా మంచి సినిమాలు తీసి తెలంగాణ పేరును నిలబెట్టాలి. అందుకు వీరికి ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయి.ఈ నెల 17 న వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.
బివరేజస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్ మాట్లాడుతూ..తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్ సపోర్ట్ తో దర్శకుడు షేర్ పేరు కు తగ్గట్టు గా మంచి సినిమా చేశాడు.ట్రైలర్, పాటలు బాగున్నాయి. త్వరలో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.
తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ…మేము పిలిచిన వెంటనే మా కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. షేర్ మంచి ట్యాలెంట్ ఉన్న దర్శకుడు. తను ఇప్పటి వరకు 10 సినిమాలు చేశాడు. వాటాన్నింటినీ నేనే రిలీజ్ చేయించడం జరిగింది. ఈ సినిమాలో చాలామంది తెలంగాణ ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చాడు. వారితో పాటు ఇంకా మంచి ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకులకు ఒక మంచి మెసేజ్ ఇస్తూ “యు ఆర్ మై హీరో” అనే చక్కటి సినిమా తీశాడు. ఈ చిత్రం ట్రైలర్, ఫైట్స్, సాంగ్స్ బాగున్నాయి. సస్పెన్స్, థ్రిల్లర్, రొమాంటిక్ ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన దర్శకుడు షేర్ ను సపోర్ట్ చేయడానికి మంత్రి గారు రావడం చాలా ఆనందంగా ఉంది .ఇప్పటివరకు చిన్న నిర్మాతలు సరైన థియేటర్స్ దొరకక ఇబ్బంది పడేవారు. ఈ విషయంపై చిన్న సినిమాలకు ఐదవ షో కు పర్మిషన్ ఇవ్వమని చాలా సంవత్సరాలనుండి ప్రభుత్వాలను అడిగే వారం. కానీ ఏ ముఖ్యమంత్రి చేయనటువంటిది ఇప్పటి కె. సి.ఆర్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఐదవ షో కు అనుమతినిస్తూ చిన్న నిర్మాతలకు సపోర్ట్ గా నిలించినందుకు చాలా సంతోషంగా ఉంది.ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 17 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర నిర్మాత మిన్ని మాట్లాడుతూ.. హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా మూవీగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న “యు ఆర్ మై హీరో ” చిత్రం ద్వారా ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇవ్వ బోతున్నాము అన్నారు.
బాలీవుడ్ విలన్ మిలింద్ గునాజీ మాట్లాడుతూ..ఇప్పటి వరకు బాలీవుడ్ లో విలన్ గా నటించిన నేను మొదటి సారిగా మంచి కాన్సెప్ట్ ఉన్న తెలుగు సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు.దర్శకుడు షేర్ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించాడు. ఈ నెల 17 న వస్తున్న ఈ సినిమా కూడా పెద్ద విజయం సాదించాలి అన్నారు.
చిత్ర దర్శకుడు షేర్ మాట్లాడుతూ..మిలింద్ గునాజీ గారు ఇందులో మంచి క్యారెక్టర్ చేశారు. తను ఈ సినిమాకు వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నటీనటులు చాలా బాగా నటించారు.తెలుగు ఇండస్ట్రీ లోని పెద్ద దర్శకుల వలన బాలీవుడ్, హాలీవుడ్ లో ఈ మధ్య తెలుగు సినిమా లకు మంచి డిమాండ్ ఉంది. దీంతో తెలుగు సినిమాలకోసం ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే మేము తీసిన ఈ సినిమాలో కూడా ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇవ్వబోతున్నాము. ఇందులో ఉన్న మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చాయి.ప్రతాని రామకృష్ణ సర్, చిత్ర నిర్మాత మిన్ని సర్ ల సపోర్ట్ తో ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. వారి సపోర్ట్ మాకు ఎప్పుడూ వుండాలని కోరుతున్నాను.మంచి కంటెంట్ తో ఈ నెల 17 న వస్తున్న వస్తున్న ఈ సినిమాకు మంచి ఔట్ ఫుట్ వచ్చింది. ఫ్యామిలీ అందరూ కలసి చూసే విధంగా తీసిన ఈ చిత్రం ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు
చిత్ర హీరో ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ..ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.ఈ సినిమా లోని పాటలు చాలా బాగా వచ్చాయి. చక్కటి కథతో ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్క ఆడియన్స్ కు తప్పక నచ్చుతుందనే నమ్మకం ఉందని అన్నారు.
హీరోయిన్ సనా ఖాన్..నేను తెలుగు సినిమాలో నటించాలనే కోరిక వుండింది. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది.నాకు తెలుగు రాకపోయినా నాకు చిత్ర యూనిట్ అంతా ఫుల్ సపోర్ట్ చేశారు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.
నటి రష్మీ ఠాగూర్,నటి శబ్నం, నిర్మాత మౌసమ్, నిర్మాత అసిఫ్,షి టీం లక్ష్మి, నిర్మాత సత్యనారాయణ తదితరులు ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.
నటీనటులు
ఫిరోజ్ ఖాన్,సనా ఖాన్,సంహిత విన్య, ఐశ్వర్య,మిలింద్ గునాజీ,మేకా రామకృష్ణ,అనంత్ తదితరులు
సాంకేతిక నిపుణులు
నిర్మాత: మిన్ని,
లైన్ ప్రొడ్యూసర్: టీనా మార్టిన్
సంగీతం, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ & దర్శకత్వం: షేర్
సహాయ దర్శకుడు: నాగు, భవాని, లోవ రాజు, వెంకీ, సుదర్శన్,
సహ దర్శకుడు: రామ్ బాబు, పురం కృష్ణ, అబిద్
అసోసియేట్ డైరెక్టర్: బాలాజీ, డి వెంకట ప్రభు, బొండ్ల రవితేజ.
సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కావేటి,
ఎడిటర్: డి వెంకట ప్రభు,
d.i: బాలాజీ,
కొరియోగ్రఫీ: సాయి రాజ్,
గీత రచయిత: బాష్య శ్రీ,
పోరాటాలు: మల్లేష్,
vfx :రవి, ప్రవీణ్ కొమరి,
ప్రొడక్షన్ మేనేజర్: అప్పారావు,
స్టిల్స్: శ్రీనివాస్
కళా దర్శకుడు: ముత్తు
కాస్ట్యూమ్స్ : నవీన్ కుమార్,మెహబూబ్
పి.ఆర్.ఓ. : ఆర్.కె.చౌదరి