HomeTeluguతొలి పాన్ ఇండియా స్టార్ క‌మ‌ల్ సారే- విక్ట‌రీ వెంక‌టేష్‌ Inbox

తొలి పాన్ ఇండియా స్టార్ క‌మ‌ల్ సారే- విక్ట‌రీ వెంక‌టేష్‌ Inbox

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ట్రైలర్ ఇటివలే విడుదలై సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం స‌మ‌కూర్చారు. జూన్ 3న విడుద‌ల‌కానున్న’విక్రమ్ ప్రీ రిలీజ్ వేడుక మంగ‌ళ‌వారం రాత్రి హైద‌రాబాద్ శిల్ప‌క‌ళావేదిక‌లో అభిమానులు, శ్రేయోభిలాషుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది.

ఈ సందర్భంగా జరిగిన ‘విక్రమ్‌: హిట్‌ లిస్ట్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంక‌టేష్ మాట్లాడుతూ –క‌మ‌ల్ సార్ విక్ర‌మ్ ఫంక్ష‌న్‌ కు ర‌మ్మ‌న్నారు అంటే రాకుండా ఎవ‌ర‌న్నా వుంటారా? అంతేగా! అంటూ ఫ్యాన్స్‌ను ఉత్తేజ‌ప‌రిచారు. క‌మ‌ల్‌ సార్ న‌ట‌న‌కు 60 ఏళ్ళు. కానీ మ‌న‌స్సు 16 ఏళ్ళ వ‌య‌స్సు.. కమల్‌ గారి ‘పదినారు వయదినిలే’ (పదహారేళ్ల వయసు) చూసిన తర్వాత నేను క్లీన్‌ బౌల్డ్ అయ్యాను. ఆయ‌న మాత్రం ఇంకా 16 ఏళ్ళ వ‌య‌స్సులో వుండిపోయారు. ‘మరో చరిత్ర’ ప్రతి యాక్టర్‌ కు జీపీఎస్‌. లాంటి సినిమా. ఇక ‘దశావతారం’ చూస్తే అలాంటి సినిమా చేయాలంటే ఓ యాక్టర్‌ కూ ధైర్యం సరిపోదు. ఆయ‌న నాకు అపూర్వ స‌హోద‌రులు.లాంటివారు. ‘ఏక్‌ దూజే కేలియే’తో ఆయన ఫస్ట్‌ పాన్‌ ఇండియా స్టార్‌. ఈ రోజు కమల్‌ గారు గ్లోబల్‌ స్టార్‌. క‌మ‌ల్ సార్ లో యూనిక్ క్వాలిటీ వుంది. కె.విశ్వ‌నాథ్‌, బాల‌చంద‌ర్ వంటివారే కాదు క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్లు, యంగ్ డైరెక్ట‌ర్లు ఆయ‌న‌తో ప‌నిచేయాల‌ని త‌హ‌త‌హ‌లాడుతారు. నాయ‌గ‌న్ సినిమా ఆయ‌న న‌ట‌న‌కే నాయ‌గ‌న్ చేసేసింది. ద‌క్షిణాది సినిమాలో రెండు శకాలు ఉంటే.. ఒకటి కమల్‌హాసన్‌ గారికి ముందు.. మరొకటి కమల్‌ గారు వచ్చిన తర్వాత. ఆయ‌న వ‌చ్చాక అన్ని స్ట‌యిల్స్ మార్చేశారు. యాక్టర్, డైరెక్టర్, రైటర్, సింగర్, కొరియోగ్రాఫర్, పొలిటీషియన్, మంచి మానవతావాది.. ఇలా చెబితే.. దశావతారాలు కాదు.. ఆయనలో శతావతారాలు కనపడతాయి. నా కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేశాను. యాక్ష‌న్‌, కామెడీ చేశాను. సెంటిమెంట్ చేయాలంటే గ‌ణేష్‌, ధ‌ర్మ‌చ‌క్రం. కానీ నాకు ఎక్క‌డైనా సీన్‌ లో బ్లాంక్ వ‌స్తే క‌మ‌ల్ హాస‌న్ ఎక్సె్ప్రెష‌న్స్‌ చూసి చేస్తాను. ఈరోజు చాలా ఆనందంగా వుంది. లోకేష్ క‌న‌క‌రాజ్‌ కు థ్యాంక్స్‌. క‌మ‌ల్‌ సార్‌ తో ఓ ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేయాలని ఉంది. నితిన్‌, సుధాక‌ర్‌రెడ్డిగారు ఈ సినిమాను విడుద‌ల‌చేస్తున్నారు. జూన్ 3న వ‌స్తుంది. అంద‌రూ చూడాలి అన్నారు.

యూనివర్సల్ హీరో కమల్‌హాసన్‌ మాట్లాడుతూ – ‘‘దాదాపు 45 ఏళ్ల క్రితం ఏయన్నార్‌ గారి ‘శ్రీమంతుడు’ సినిమాకు డ్యాన్స్‌ అసిస్టెంట్‌ గా హైదరాబాద్‌ వచ్చాను. అప్పట్నుంచి నేను తెలుగు ఫుడ్‌ తింటున్నాను. తెలుగులో నాకు ప్రేక్ష‌కులు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. నేను ఇది ఒంట‌రిగా చేసింది కాదు. నా కుటుంబం ప్రోత్సాహంతో ద‌ర్శ‌కుడుని అయ్యాను. మిగిలిన క్రాఫ్ట్‌ ను చేశాను. డైరెక్టర్‌ బాలచందర్‌గారితో నేను 36 సినిమాలు చేశాను. అదే నా పీహెచ్‌డీ. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నా స్టైల్, రజనీకాంత్‌ స్టైల్‌ ఆయన్నుంచే వచ్చాయి. న‌గేష్‌ గారి స్ట‌యిల్‌కూడా బాలచందర్‌ గా రు చెప్పిందే.

చిత్ర ద‌ర్శ‌కుడు లోకేశ్‌ కనగరాజ్ మాట్లాడుతూ, విక్ర‌మ్ ఇప్పుడు కంప్లీట్ ఫైన‌ల్ మిక్సింగ్ అయిపోయింది. చాలా అద్భుతంగా వ‌చ్చింది. ఈ వేడుక‌కు వ‌చ్చిన వెంక‌టేస్‌ కు, నితిన్‌ కు థ్యాంక్స్‌. తెలుగు ఆడియ‌న్స్‌కు ధ‌న్య‌వాదాలు. నా మొద‌టి సినిమా నుంచి మీరు ప్రోత్స‌హిస్తున్నారు. విక్ర‌మ్ కూడా అలానే చేస్తార‌ని ఆశిస్తున్నాను.  జూన్ 3న విడుద‌ల‌వుతున్న ఈ సినిమాలో కమల్‌ గారి అద్భుతమైన యాక్షన్‌ను మీరు చూస్తారు ‘ అన్నారు

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES