HomeTeluguశ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్ చిత్రం ‘రంగ రంగ వైభవంగా’ .. ‘కొత్తగా...

శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్ చిత్రం ‘రంగ రంగ వైభవంగా’ .. ‘కొత్తగా లేదేంటి..’ సాంగ్ రిలీజ్

ఉప్పెన’ సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన యువ క‌థానాయ‌కుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో.. తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ గిరీశాయ ద‌ర్శ‌కుడిగా బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘రంగ రంగ వైభ‌వంగా’. కేతికా శ‌ర్మ హీరోయిన్‌. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. జూలై 1 ఈ చిత్రాన్ని భారీ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.

సినిమా ప్రమోషన్స్ స్పీడు మీదుంది. ఇటీవల విడుద‌లైన ఈ మూవీ టైటిల్ టీజ‌ర్‌, పాట‌కు ఆడియెన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వ‌చ్చింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం సినిమాకు మేజ‌ర్ హైలైట్‌గా నిలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి డ్యూయెట్ సాంగ్ ‘కొత్తగా లేదేంటి..’ అంటూ సాగే ల‌వ్‌ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

అర్మాన్ మాలిక్‌, హ‌రి ప్రియ పాడిన ఈ పాట‌ను శ్రీమ‌ణి రాశారు. ఈ సాంగ్ ప్రేమికుల‌కు క‌నెక్ట్ అయ్యేలా రాక్ స్టార్‌ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతంలో కంపోజ్ చేసినట్లు అనిపిస్తుంది. ఈ చిత్రానికి శ్యామ్ ద‌త్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES