HomeTeluguజులై 29 నుంచి ఇన్వెస్టిగేషన్‌కి రెడీ అవుతున్న అడివి శేష్‌

జులై 29 నుంచి ఇన్వెస్టిగేషన్‌కి రెడీ అవుతున్న అడివి శేష్‌

కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయడానికి, కొత్త కాన్సెప్ట్‌ సినిమాలను తెరకెక్కించడానికి నిర్మాణంలో భాగమైన హీరో నాని వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేనితో కలిసి తొలి చిత్రంగా అ! సినిమాను రూపొందించి సూపర్‌ హిట్‌ కొట్టారు. రెండో చిత్రంగా ‘హిట్‌’ అనే సీట్‌ థ్రిల్లర్‌ను రూపొందించి సూపర్‌ డూపర్ హిట్‌ సాధించారు. రీసెంట్‌గా హిట్‌ సినిమాకు ఫ్రాంచైజీగా ‘హిట్ ‌2 ద సెకండ్ కేస్‌’ చిత్రాన్ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డ్రామా ఇది. హిట్ సినిమాతో ఆడియెన్స్ మెప్పించిన ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలోనే హిట్ 2 ద సెకండ్ కేస్ సినిమా రూపొందుతోంది.

సోమవారం రోజున ‘హిట్ 2 ద సెకండ్‌ కేస్‌’ చిత్రాన్ని జులై 29న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. క్ష‌ణం, ఎవ‌రు, గూఢ‌చారి వంటి చిత్రాల‌తో వ‌రుస సూప‌ర్ హిట్స్ కొట్టిన టాలెంటెడ్ హీరో అడివి శేష్ ఇందులో హీరోగా న‌టించారు. ఈ మూవీలో అడివి శేష్ కృష్ణ దేవ్‌ అలియాస్‌ కె.డి పాత్రలో మెప్పించున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్‌ ఆఫీసర్‌ అమ్మాయి మిస్సింగ్‌ కేసుని ఎలా డీల్‌ చేశాడనే కాన్సెప్ట్‌తో హిట్‌ ‌(మోమిసైడ్‌ ఇంటర్‌వెన్షన్‌ టీమ్‌) సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ చెందిన హిట్‌ టీమ్‌ ఆఫీసర్‌ కృష్ణ దేవ్‌ అలియాస్‌ కె.డి ఈ ఎగ్జయిటింగ్‌ జర్నీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.

డైరెక్ట‌ర్ శైలేష్‌ ఖాతాలో ఫ‌స్ట్ పార్ట్ ని పర్ఫెక్ట్ గా హ్యాండిల్‌ చేశారన్న క్రెడిట్‌ ఆల్రెడీ ఉంది. హిట్‌ సీక్వెల్‌ని కూడా పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్‌ డ్రామాగా, మరిన్ని థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కించారు. ఆల్రెడీ హిందీలో హిట్‌ ఫస్ట్ పార్ట్ రీమేక్‌ని రాజ్‌కుమార్‌ రావుతో పూర్తి చేశారు మన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శైలేష్‌.

హిట్ 2 రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయ‌టంతో పాటు ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ని కూడా రిలీజ్‌ చేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. శేష్‌ ముందు ఏదో కేసు… దాన్ని ఎలా సాల్వ్ చేయాలని దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు శేష్‌ ఉన్న ఫొటోను రిలీజ్‌ చేశారు. హిట్‌ సీక్వెల్‌ మీద ఉన్న అంచనాలను తారా స్థాయికి చేరుస్తోందీ పోస్టర్‌. మ‌ణి కంద‌న్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందిస్తున్నారు.

నటీనటులు:
అడివిశేష్‌, మీనాక్షి చౌదరి, రావు రమేష్‌, భాను చందర్‌, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్‌ తదితరులు

సాంకేతిక వర్గం:
సమర్పణ: నాని
బ్యానర్‌: వాల్‌పోస్టర్‌ సినిమా
నిర్మాత: ప్రశాంతి త్రిపిర్‌నేని
రచన, దర్శకత్వం: డా. శైలేష్‌ కొలను
సినిమాటోగ్రఫీ: మణికందన్‌.ఎస్
సంగీతం: జాన్‌ స్టీవర్స్‌ ఎడురి
ఆర్ట్‌: మనీషా ఎ.దత్‌
ఎడిటింగ్‌: గ్యారీ బి.హెచ్
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.వెంకట్ రత్నం(వెంకట్‌)

PRO;VAMSI KAKA

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES