మెగాస్టార్ చిరంజీవి. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య’. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29 విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 23న ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా …
చిత్ర నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివగారు రూపొందిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. సినిమా అనౌన్స్‌మెంట్ రోజు నుంచి మెగా ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులు అందరూ చిరంజీవిగారు, రామ్ చరణ్‌గారు పూర్తిస్థాయి చిత్రంలో కలిసి నటిస్తే ఎలా ఉంటుందో చూడాలని ఎదురు చూశారు. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్‌కి వచ్చిన రెస్పాన్స్‌ను బట్టే సినిమాపై ఉన్న అంచనాలను ఊహించాం. ఎక్స్‌పెక్టేషన్స్‌ను మించేలానే సినిమాను రూపొందించాం. ఏప్రిల్ 29న మూవీ రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 23న గ్రాండ్ లెవల్లో హైదరాబాద్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నాం.
సన్నివేశాల్లో నటన, డాన్సులు, డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ఇలా అన్ని ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. ఆచార్య చిత్రం కోసం ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎంత ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నారో మేం కూడా అంతే ఎగ్జయిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాం’’ అన్నారు.