చదువుకొనే స్థోమత లేక మధ్యలోనే చదువును వదిలేస్తున్న పిల్లలు, సరైన సమయానికి రక్తం, వైద్యం దొరకక ఎంతో మంది మరణిస్తున్నారు.ఇలా చైల్డ్ ఎడ్యుకేషన్ కానీ, ఐ డొనేషన్, బ్లడ్ డొనేషన్ ఇలా పలు రకాలుగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు సేవలందిస్తుంది ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ. మరింత మంది బాధితులకు చేయూత నివ్వడానికి ముందుకు వచ్చిన ఈ సంస్థను సపోర్ట్ చేయడానికి టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) కెప్టెన్ హీరో శ్రీకాంత్, వైస్ కెప్టెన్ తరుణ్ లు ముందుకు రావడంతో ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ & ఎలైట్ మీడియాల్ వారు ఆడియన్స్ (ఫ్యాన్స్) కు విన్నూతనమైన కొన్సెప్టుతో స్టార్స్ తో కలసి ఆడేందుకు అవకాశం కలిపిస్తున్నారు..ఈ హీరోలతో అడాలి అనుకున్నవారు బిడ్డింగ్ లో పాల్గొని విన్ అయిన వారు యూనివర్సల్ XL జట్టులో సభ్యులు అవుతారు.ఆ తరువాత అమెరికాలోని డల్లాస్ లో టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) తో బిడ్డింగ్ ద్వారా సెలెక్ట్ అయిన యూనివర్సల్ XL టీం పోటీపడుతుంది.ఈ మ్యాచ్ నిర్వహణ ద్వారా వచ్చిన ఆదాయాన్ని చారిటీకి డొనేట్ చేయడం జరుగుతుంది.ఈ మ్యాచ్ కు సంబంధించిన వివరాలను తెలియజేయదానికి ఈస్ట్ వెస్ట్ ఏంటర్టైన్మెంట్ & ఎలైట్ సంస్థలు శనివారం హైదరాబాద్ లోని దస్పల్లా హోటల్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) కెప్టెన్ హీరో శ్రీకాంత్, వైస్ కెప్టెన్ తరుణ్ జట్టు సభ్యులు తమన్ ,సుధీర్ బాబు, , ప్రిన్స్, భూపాల్ తో పాటు ఈస్ట్ వెస్ట్ సభ్యులు,ఎలైట్ మీడియా సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
ఎలైట్ మీడియా అధినేత మురళి మెహన్ వీడియో బైట్ ద్వారా మాట్లాడుతూ..ఎలైట్ మీడియా మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్, సినిమా డిస్ట్రిబ్యూషన్,సినిమా నిర్మాణం, ఓటిటి రిలీజెస్ వంటి కార్యక్రమాలు చేస్తుంది.అయితే మేము.ఈ రోజు ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ వారితో బాగస్వామ్య మైనందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.
ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ సీఈవో రాజీవ్ మాట్లాడుతూ.. మేము సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ అనేది 2019 మే లో సౌత్ ఆఫ్రికా ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ చేశాం. దీనికి టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ( టిసిఎ) శ్రీకాంత్ గారు తరుణ్ గారు కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్. .ప్రతి మ్యాచ్ కూడా చారిటీ కోసం మొదలుపెట్టాము టి సిఏ ఇన్సియటివ్ సపోర్ట్ తో 2019 అక్టోబర్ లో లో బోస్టన్ చేశాము. ప్యాండమిక్ రావడంవలన 20, 21 ఈ కార్యక్రమం చేయలేక పోయాము. మళ్లీ ఈ సంవత్సరం సెప్టెంబర్ 24 వతేదీన డల్లాస్ లో ఎంటర్టైన్మెంట్ చేయడానికి మళ్లీ మీ ముందుకు వస్తున్నాము.23 న బ్యాంకేట్ నైట్ ఉంటుంది.ఇక్కడికి చాలా మంది హీరోయిన్స్ వస్తారు.అలాగే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. జబర్దస్త్ బ్యాచ్ కూడా అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. లోకల్ సింగర్స్, డ్యాన్సర్స్ వస్తారు. మీనాక్షి శేషాద్రి ఇన్స్ట్యూట్ ఉంది.దాంతో క్లాసికల్ డ్యాన్స్ ను కూడా మేము పరిచయం చేస్తున్నాము.. 24 క్రికెట్ మ్యాచ్ నడుస్తుంది 25న స్పాన్సర్స్ కోసం ఎక్స్క్లూజివ్ గా ఒక మ్యాచ్ ఆడుతున్నాం.జులై ఫస్ట్ వీక్ వైజాగ్ లో కర్టన్ రైజర్ ఈవెంట్ చేస్తాం, ఆగస్టు లాస్ట్ వీక్ లో విజయవాడ లో ఇంకొక కర్టన్ రైజర్ ఈవెంట్ చేస్తాం. సెప్టెంబర్ దె డల్లాస్ కు వెళ్లేముందు హైదరాబాద్ లో ఒక ప్రి బ్యాంగ్ ఉంటుంది.అది అయిపోయిన తరువాత డల్లాస్ కు వెళ్లడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనము చూసిన క్రికెట్ మ్యాచులు అన్నీ కూడా సెలబ్రిటీస్ VS సెలబ్రిటీస్, సెలెబ్రిటీస్ VS స్టార్స్ ఆడిన క్రికెట్ మ్యాచ్ చూశాము. కానీ ఇప్పుడు మనమధ్య ఆడాలి అంటే ఆ టీం పెరు యూనివర్సల్ ఎక్స్.ఈ టీం క్రికెట్ బిడ్డింగ్ ద్వారా ఫామ్ అవుతుంది.ప్రతిఒక్కరూ కూడా సెలబ్రిటీస్ మీద ఆడాలి అనుకుంటే బిడ్డింగ్ లో పాల్గొని యూనివర్సల్ XL ద్వారా సెలబ్రిటీస్ తో క్రికెట్ మ్యాచ్ అడవచ్చు. నెక్స్ట్ మంత్ నుండి బిడ్డింగ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి ఆన్ లైన్ లో ఓపెన్ చేస్తున్నాము.దీన్ని ఆన్ లైన్ లో బిడ్డింగ్ చేసుకోవాలి. ఒక్కొక్క ప్రైవస్ కు ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది.ఒకొక్క కెప్టెన్ కు ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది.ఒక వేళ టీం మొత్తాన్ని కొనాలి అనుకున్నా బిడ్డింగ్ ద్వారా కొనుకోవచ్చు.ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలంటే ఆన్ లైన్ వెళ్ళిన తర్వాత www east west ఎంటర్టైన్మెంట్. కామ్ కి వెళ్తే అక్కడ వీడియో ద్వారా పూర్తి వివరాలు కనుకోవచ్చు.ఆ వీడియోలో మీరెలా పార్టీసీపేట్ చేయాలి.బిడ్ చేయాలి ఇలా అన్నీ వివరాలు ఉంటాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఏ మూలన ఉన్నా ఏ దేశంలో ఉన్నా ప్లేయర్ గా రావచ్చు. ఇది టాలీవుడ్ సెలెబ్రెటీస్ VS ఫ్యాన్స్. కామన్ గా ప్రతి ఒక్కరికీ హీరోలతో క్రికెట్ ఆడాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది.అందరూ ఈ అవకాశాన్ని వినియోగించు కోవచ్చు.కాబట్టి ఆన్ లైన్ లో బిడ్ చేసి విన్ అయ్యి సెప్టెంబర్ 24 న డల్లాస్ లో జరిగే మ్యాచ్ లో అడచ్చు.ఇంతకుముందు సౌత్ ఆఫ్రికా మ్యాచ్ రమేష్ గారు చేశారు. ఇప్పుడు ఆయన మా ఈస్ట్ వెస్ట్ కు వచ్చాడు. ఇప్పుదు తాను మా కంపెనీలో వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా, బోస్టన్ వేర్వేరుగా చూస్తేనే సెలబ్రిటీస్ గాని ఫ్యాన్స్ గాని చాలా సర్ప్రైజ్ అవుతారు. ఇప్పుడు ఇద్దరం కలిసి చేస్తున్నామంటే డల్లాస్లో ఇప్పుడు చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్ కు డల్లాస్ కంచుకోట. ఎందుకంటే దీని ఫౌండర్ వరప్రసాద్ బొడ్డు గారు ఉండేది డెల్లాసే ,అక్కడే ఆయనకు 15 బిజినెస్ లు ఉండడం వలన ఇప్పుడు మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నాము. ఇప్పుడు మేము జరుపబోయే ఈవెంట్ పెద్ద పెస్ట్ అవుతుంది. ఇక్కడకు సుమారు 15,000 మంది ఆడియన్స్ వచ్చే ఛాన్సుంది.
టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ టీం కెప్టెన్ శ్రీకాంత్ , వైస్ కెప్టెన్ తరుణ్, తమన్ , సుధీర్ బాబు, సందీప్ కిషన్, నిఖిల్, శర్వానంద్, నాని, ప్రిన్స్, భూపాల్, అల్లరినరేష్ ,ఇంకా కొంతమందిని త్వరలో అనౌన్స్ చేస్తాము. అలాగే సునీల్ గారు వస్తున్నారు పెరఫార్మెన్స్ ఉంది. ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు అనుకుంటున్నాం వాళ్ళ పర్ఫామెన్స్ కూడా ఉన్నాయి. టాలీవుడ్ సెలెబ్రెటీస్ టీం అంతా కూడా ఫ్యాన్స్ తో ఆడతారు. అలా వచ్చిన డబ్బును మేము చారిటీకి డొనేట్ చేస్తాము అని అన్నారు
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. క్రికెట్ అంటే మా అందరికీ ఎంతో ఇంట్రెస్ట్.మంచి పనికోసం మేము చాలాసార్లు క్రికెట్ మ్యాచ్ లు ఆడడం జరిగింది.అయితే ఈస్ట్ వెస్ట్,ఏలైట్ మీడియా వారు మమ్మల్ని కలసి ఒక మంచి కాజ్ కోసం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము మా సపోర్ట్ కావాలన్నారు.ఒక మంచి కాజ్ కోసం మేము ఒప్పుకొని మ్యాచ్ ఆడడం జరిగింది. అయితే మేము సౌత్ ఆఫ్రికాలోని సెంచూరియన్ గ్రౌండ్స్ లో అడతామని అనుకోలేదు.తమను కొట్టిన సిక్స్ లన్నీ కూడా గ్రౌండ్ బయట పడ్డాయి.అక్కడ రమేష్ అందరికి చక్కటి హాస్పిటాలిటీ కల్పించారు. ఇప్పుడు మళ్లీ డల్లాస్ లో క్రికెట్ ఆడడానికి సిద్ధమయ్యాము.అక్కడ వరప్రసాద్ గారు ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ & ఎలైట్ మీడియా వారు అరేంజ్ చేయడం జరుగుతుంది అని అన్నారు.
హీరో తరుణ్ మాట్లాడుతూ.. టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిసారి ఒక మంచి కోసమే ఆడతాం ఎప్పుడు ఎనీ టైం ,చైల్డ్ ఎడ్యుకేషన్ కానీ, బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్ ఇలా దేనికైనా మేమంతా ఈ క్రికెట్ ఆడుతున్నాం.2019లో సౌతాఫ్రికాలో ఆడిన మ్యాచ్ మాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్.తరువాత యు.ఎస్ లో ఆది బాగా ఎంజాయ్ చేసాము.ఇప్పుడు సెప్టెంబర్ 24 నమా టీం యూనివర్సల్ XL టీం తో ఆడబోతున్నాము.అది కూడా బిల్డింగ్ ప్రాసెస్ లో..ఎవరు హయ్యెస్ట్ బిడ్డింగ్ చేస్తారో వాళ్లతో మేము ఆడడం జరుగుతుంది అన్నారు.
సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ..సౌత్ ఆఫ్రికా లో టిసిఎ తరుపున మేము ఆడే క్రికెట్ కోసం ఇంత రెస్పాన్స్ వస్తుందని మేము ఊహించలేదు.మేము అప్పుడప్పుడు రాత్రి మ్యాచ్ లు ఆడతాము తప్ప అంత పెద్ద క్రవ్ లో ఆడడంమాకు చాలా హ్యాపీగా అనిపించింది. సెప్టెంబర్ 24న డల్లాస్ లో బిడ్డింగ్ లో విన్ అయ్యే యూనివర్సల్ లెవెన్ తో మేము ఆడుతున్నాం. ఒక మంచి కాజ్ కోసం ఈ పని చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. శ్రీకాంత్ తరుణ్ లో టిసిఏ ను స్టార్ట్ చేశారు. ప్రతి సంవత్సరం ఒక మంచి కాజ్ కోసం వాళ్లు చేసే పనిలో నేను బాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది..రెగ్యులర్ గా స్టార్స్ స్టార్స్ ఆడడం కామన్ కానీ బిడ్డింగ్ ఫార్మెట్ లో ఆడ చాలా డీఫ్రెంట్ గా సంతోషంగా ఉంది అన్నారు.
హీరో ప్రిన్స్ మాట్లాడుతూ.. TCA కు నేను క్రికెట్ ఆడటం చాలా హ్యాపీ గా ఉంది.నాకు క్రికెట్ ఆడడం సరదా కానీ..సరదాగా ఒక మంచి కోసం ఆడడం చాలా సంతోషంగా ఉందని అన్నారు..
ఇంకా ఈ కార్యక్రమంలో ఈస్ట్ వెస్ట్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ మరియు,ఎలైట్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు