HomeTelugu"మిస్టర్ రావణ " ప్రారంభం

“మిస్టర్ రావణ ” ప్రారంభం

మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్ బాలీవుడ్ స్టార్ నటుడు అనూప్ సింగ్ ఠాగూర్ టైటిల్ పాత్రలో “మిస్టర్ రావణ” అనే చిత్రం తెరమీదకు వస్తొంది. తెలుగు ,తమిళ కన్నడ, హిందీ భాషల్లొ తీసె ఈ సినిమా ఇటీవలె ముంబై లొని ప్రపంచ ప్రసిద్దమైన శ్రీ వరసిద్ధి వినాయక టెంపుల్ లొ ప్రారంభమైంది. ‌కుందన ఆర్ట్స్ పతాకంపై కుందన్ రాజ్ ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.
అనూప్ సింగ్ మాట్లాడుతూ.. స్క్రిప్ట్ , నా క్యారక్టరైజెషన్ ను చాలా బాగా డిజైన్ చేశారు. ‌నటిడుగా నా కెరీర్ లో ఇదొక ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందన్నారు.
సలోని మాట్లాడుతూ.. రియలిస్టిక్ కథాశంతో ఈ సినిమా ఉంటుంది. నా పాత్ర వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుందన్నారు.
దర్శకుడు ధనరాజ్ మాట్లాడుతూ.. అనూప్ సింగ్ ఠాగూర్ విలన్ గా మనకు సుపరిచితుడె.‌ ఈ సినిమాలొ కూడా ఆయన టైటిల్ పాత్రలొ నట విశ్వరూపాన్ని చూపిస్తారు.‌సలోని హీరొయిన్ గా నటిస్తుందన్నారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందన్నారు.‌
నిర్మాత కుందన్ రాజ్ మాట్లాడుతూ.. భారీ బడ్జెట్ తో నాలుగు భాషల్లో ఈ సినిమా తెరమీద కు రానుంది. అన్నీ భాషల నటీనటులు ఈ చిత్రం లో ఉంటారన్నారు.
ఈ చిత్రానికి ,కెమెరా: సురేందర్ రెడ్డి, సహనిర్మాత: ఇంద్రజిత్, నిర్మాణం : కుందన్ ఆర్ట్స్‌, కథ-కథనం-దర్శకత్వం : కుందన్ రాజ్.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES