HomeTeluguసముద్ర డైరెక్షన్‌లో రూపొందుతున్న 'జైసేన' మంచి విజయం సాధిస్తుంది - మెగా బ్రదర్‌ నాగబాబు

సముద్ర డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘జైసేన’ మంచి విజయం సాధిస్తుంది – మెగా బ్రదర్‌ నాగబాబు

శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌గౌతమ్‌లను పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయిఅరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల విడుదలైన సునీల్‌ టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది.
‘మా స్టూడెంట్స్‌ పవరేంటో తెలిపేదే సేన’
ఈ సినిమాలోని ఫస్ట్‌ సాంగ్‌, టైటిల్‌ సాంగ్‌ను మెగాబ్రదర్‌ నాగబాబు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వి.సముద్ర, కో ప్రొడ్యూసర్‌: శిరీష్‌రెడ్డి, హీరోలు శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.
‘హలో మిత్రమా……సేన జై సేన సేన.. మా స్టూడెంట్స్‌ పవరేంటో తెలిపేదే సేన.. యుద్ధం చెయ్‌, యుద్ధం చెయ్‌, యుద్ధం చెయ్‌రా..’ అంటూ సాగే ఈ పాటలో ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ డ్రెస్‌తో, ఆర్మీ యూనిఫాంలో ఉన్న యంగ్‌స్టర్స్‌ కనిపిస్తారు. అలాగే మన జాతీయ జెండాను కూడా ప్రొజెక్ట్‌ చేయడంతో ఈ పాట ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తోంది.
‘జైసేన’ సాంగ్‌ను విడుదల చేసిన అనంతరం మెగాబ్రదర్‌ నాగబాబు మాట్లాడుతూ ”శివ మహాతేజ బేనర్‌లో డైరెక్టర్‌ సముద్రగారు నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘జైసేన’ అనే టైటిల్‌ పెట్టారు. యంగ్‌స్టర్స్‌ ఈ సినిమాలో మంచి పాత్రలు పోషించారు. శ్రీకాంత్‌, సునీల్‌ ప్రముఖ క్యారెక్టర్స్‌ చేశారు. సాంగ్‌ చూసినపుడు యూత్‌ అండ్‌ పొలిటికల్‌ మూవీ అనిపించింది. ఈ సినిమాకి పనిచేసిన వారందరికీ, ఈ సినిమాకి దర్శకత్వం వహించి నిర్మిస్తున్న సముద్రగారికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్తున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES