HomeTeluguఏప్రిల్ 3 న ఘనంగా "శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్" ఉగాది పురస్కారాలు

ఏప్రిల్ 3 న ఘనంగా “శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్” ఉగాది పురస్కారాలు

చెన్నై మహానగరంలో తెలుగువారి ఘన కీర్తిని చాటుతూ 1998 న శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ స్థాపించి సినీ రంగానికే కాక ఇతర రంగాలలో విశిష్ట సేవలు అందించే వారికి సైతం అవార్డ్స్ ను బహుకరిస్తూ అందరి మన్ననలను అందుకుంటుంది. ఇప్పుడు జరుపబోయే ఉగాది పురస్కారాల కార్యక్రమంతో 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని వచ్చే సంవత్సరం సిల్వర్ జూబ్లీ కు అడుగులు వేస్తుంది శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా అవార్డ్ ప్రధానోత్సవ కార్యక్రమం జరుపని కారణంగా 2020, 2021లో విడుదలైన చలన చిత్రాలలోని 20 విభాగాలకు సంబంధించిన వారికే కాక ఇతర రంగాలలో రాణించిన విశిష్ట అతిధులకు అందించే ఉగాది పురస్కారముల అవార్డ్స్ ప్రదానోత్సవం ను చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో ఏప్రిల్ 3 వ తేదీ 2022 ఘనంగా జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా అసోసియేషన్ ఫౌండర్ బేతిరెడ్డి శ్రీనివాస్, సభ్యులు వెంకటేశ్వరరావు, దేవినేని సౌజన్యలు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు..ఈ కార్యక్రమానికి ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ వడ్ల పట్ల మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఫౌండర్ బేతిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ..చెన్నైలో శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ 1998 నవంబర్ 21న ఈ అసోసియేషన్ ప్రారంభించిన అసోసియేషన్ లో ఇప్పుడు 1200 పైచిలుకు సభ్యులు ఉన్నారు. వీరంతా తెలుగువారే.. అయితే బాపు గారు పరమపదించిన తర్వాత బాల సుబ్రహ్మణ్యం గారు బాపు పేరుతో అవార్డు ఇవ్వాలని చెప్పడంతో గత 5 సంవత్సరాలుగా బాపు బొమ్మ, బాపు-రమణల పేర్లు మీదుగా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులోని అందరి సభ్యుల సహాయ సహకారాలతో ఈ అవార్డ్ ప్రదానోత్సవం ప్రతి సంవత్సరం ఎంతో గ్రాండ్ గా నిర్విస్తున్న ఈ కార్యక్రమం ఇప్పుడు 24వ సంవత్సరం లోకి అదుగుపెట్టిన సందర్భంగా “శ్రీ శుభకృతు” నామ సంవత్సర ఉగాది పండుగ రోజున మహిళా రత్న మరియు బాపు బొమ్మ, బాపు రమణ పురస్కారాలను చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో ఏప్రిల్ 3 వ తేదీ 2022 ఆదివారం సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు వేద ఆశీర్వచన పఠనంతో ప్రారంభించి 2020, 2021లో విడుదలైన చలన చిత్రాలతో 20 విభాగాలకు సంబంధించిన నటీనటులను, దర్శక నిర్మాతలను మరియు సాంకేతిక నిపుణులను ఉగాది పురస్కారములతో మరియు వివిధ రంగాలలో నిష్ణాతులైన మహిళామణులకు మహిళా రత్న పురస్కారం వెండి కిరీటం ధారణతో సత్కరించుటకు కమిటీ సభ్యులతో చర్చించి నిర్ణయించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్ డా. రామ మోహన్ రావు, శ్రీ ఆర్ శేఖర్ రెడ్డి,శ్రీ పి.యస్. ప్రకాష్ రావు మరియు సినీ రంగ ప్రముఖులు,నటీనటులతో పాటు పాటు శ్రీ కళాసుధ సభ్యులు ఈ కార్యక్రమం పాల్గొనడం జరుగుతుంది.అని అన్నారు.

ముఖ్య ఆతిదిగా వచ్చిన మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. శ్రీనివాస్ గారు 24 సంవత్సరాల క్రితం ఈ సంస్థ ను చెన్నై లో ఏర్పాటు చేశారు.అక్కడ తెలుగు అనేదానికి బాగా ఎస్టాబ్లిస్ చేశాడు.సినీ రంగానికే కాకుండా ఇతర రంగాలకు కూడా అవార్డ్స్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.నా సినిమా “కలవరమాయే మదిలో” సినిమాకు ఇక్కడ బెస్ట్ నంది అవార్డు వచ్చింది. అయితే ఈ అసోసియేషన్ వారు ఫోన్ చేసి నా సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డ్ ఇస్తామని సర్ప్రైజ్ చేయగా.. ఆ అవార్డ్ ను జయప్రద చేతుల మీదుగా అందుకోవడం జరిగింది.దిన డినాభివృద్ధి చెందుతూ నేటితో 24 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. అయితే ఈ సంవత్సరం అవార్డ్స్ కు చీఫ్ గెస్ట్ గా..టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి వస్తుండగా, విశిష్ట అతిధులుగా ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ రామ్మోహన్ గార్లు వస్తున్నారు

విశిష్ట ఉగాది పురస్కార అవార్డులను

గ్లోబల్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ కె రవీంద్రనాథ్,
సౌత్ ఈస్ట్ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ శ్రీ మువ్వా పద్మయ్య ,
లతామంగేష్కర్ పురస్కారం : శ్రీ పి సుశీల
ఎస్పీ బాలసుబ్రమణ్యం పురస్కారం : శ్రీ మనో
సిరివెన్నెల సీతారామశాస్త్రి పురస్కారం : శ్రీ చంద్ర బోస్ (పాటల రచయిత)
వైయస్సార్ స్వామి పురస్కారం : శ్రీ రామ్ ప్రసాద్ (సినిమాటోగ్రఫీ అఖండ)

సినీరంగానికి ఉగాది పురస్కార్ అవార్డ్స్ ను

ఉత్తమ చిత్రం : ఉప్పెన (మైత్రీ మూవీస్),
ఉత్తమ సంచలనాత్మక చిత్రం : అఖండ (మిర్యాల రవీందర్ రెడ్డి)
ఉత్తమ సంగీత దర్శకుడు : దేవి శ్రీ ప్రసాద్ (ఉప్పెన, పుష్ప) 2021
ఉత్తమ సంగీత దర్శకుడు : తమన్ (అల వైకుంఠపురంలో 2020)
ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ (పుష్ప)
ఉత్తమ ప్రతినాయకుడు : విజయ్ సేతుపతి (ఉప్పెన) ఉత్తమ నటి : సాయి పల్లవి (లవ్ స్టోరీ)
ఉత్తమ దర్శకుడు : సుకుమార్ (పుష్ప)
ఉత్తమ నూతన దర్శకుడు : బుచ్చిబాబు సన (ఉప్పెన)
ఉత్తమ నూతన దర్శకుడు శైలేష్ కొలను (హిట్ 2020)
ఉత్తమ నూతన మహిళా దర్శకురాలు : గౌరీ (పెళ్లిసందడి) 2021
ఉత్తమ నూతన నటుడు : వైష్ణవ తేజ్ (ఉప్పెన)
ఉత్తమ నూతన నటుడు : ప్రదీప్ మాచిరాజు *30 రోజుల్లో ప్రేమించడం ఎలా?)
ప్రత్యేక జ్యూరీ అవార్డు : నాగసౌర్య ,రీతు వర్మ
బాపుబొమ్మ పురస్కార గ్రహీతలు

నటీమణులు : కృతి శెట్టి , శ్రీ లీల, ఏ సంధ్యా రాజు, బాపు-రమణ పురస్కార గ్రహీతలు ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల

మహిళా రత్న పురస్కారాలు
వైద్య సేవా రంగం : శ్రీమతి డాక్టర్ సరిత వినోద్ తదితరులకు ఏప్రిల్ 3న సాయంత్రం 4:23 నుండి ఈ అవార్డ్స్ చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ అందజేయబడుతాయి.

సభ్యురాలు సౌజన్య మాట్లాడుతూ..కొత్తగా సినీ రంగానికి పరిచయమైన యాక్ట్రెస్ కు బాపుబొమ్మ అవార్డ్స్ ను ఉప్పెన ఫేం కృతి శెట్టి, పెళ్లి సందడి శ్రీ లీల,నాట్యం ఫేం ఎ.సంధ్యా రాజులకు, బాపు రమణల అవార్డ్స్ ను ప్రముఖ దర్శకుడు శేకర్ కమ్ముల గారికి .వైద్య రంగానికి గాను మహిళా రత్న అవార్డ్ శ్రీమతి డాక్టర్ సరిత వినోద్ గారికి, మిస్ ఇండియా యర్త్ గా ఎంపికైన డా.తేజస్విని మనోగ్న కు, నాట్య రంగా నికి డా.వైష్ణవి సాయినాథ్ లకు అందజేయ బడుతుంది అన్నారు.

కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..చెన్నయ్ లో మేము జరుపబోయే శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ అవార్డ్స్ కు అందరూ వచ్చి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అన్నారు.


P.Rambabu
cinejosh.com
9848 123 007

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES