కన్నడలో అగ్ర హీరోలతో “అగ్రజ”, “లీ” వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన హెచ్.ఎం.శ్రీనందన్ తెలుగులో “లై లవర్స్” గా కన్నడలో “బీగ” బై లెంగ్వల్ చిత్రానికి దర్శకత్వం వహించారు
హెచ్.యమ్ మూవీ మేకర్స్, వి.యమ్.ఆర్ ప్రొడక్షన్ లో జెడి.ఆకాష్, సెహర్ అప్సర్, సుమితా బజాజ్ నటిస్తున్నారు. రమేష్ రెడ్డి, చెక్జల నాగేశ్వర్ రెడ్డి లు సంయుక్తంగా ఈ చిత్రాలను నిర్మిస్తున్నారు.’ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ఫస్ట్ లుక్ పోస్టర్ & టీజర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన , దర్శకుడు ఏ.యస్. రవి కుమార్ చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుచేయగా దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి, వీరభద్రం చౌదరి లు టీజర్ ను విడుదల చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకులు సాగర్, ప్రసన్నకుమార్, నిర్మాత బాపిరాజు తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం జరిగిన పాత్రికేయులు సమావేశంలో
చిత్ర దర్శకుడు హెచ్.ఎం.శ్రీనందన్ మాట్లాడుతూ..సినిమాపై ఉన్న ఫ్యాషన్ తో దర్శకుడు అవ్వాలని ఇండష్ట్రీకు వచ్చాను. గురువు గారు సాగర్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేయడం జరిగింది. ఆ తరువాత తెలుగులో అనేక మంది దర్శకుల దగ్గర పని చేశాను.తెలుగులో సినిమాలు చేయడానికి చాలా ప్రయత్నించాను.అనుకోకుండా బెంగుళూర్ వెళ్లిన నేను 2014 లో ”అగ్రజ”సినిమాచేయడం జరిగింది. ఈ సినిమాలో పెద్ద స్టార్ క్యాస్ట్ వున్నా.. నా మొదటి సినిమాకు మా గురువు సాగర్ గారిని చీఫ్ గెస్ట్ గా పిలిచి తనచేత క్లాప్ కొట్టించడం జరిగింది.అలా కన్నడలో నేను కొన్ని సినిమాలు చేయడం జరిగింది. నేను తెలుగు వాడినైనా కన్నడ వాళ్ళు అక్కున చేర్చుకొని నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు.ప్రస్తుతం కన్నడ తెలుగు అనే బాషా భేదం లేదు.కంటెంట్ బాగుంటే ఎక్కడికైనా వెళ్లొచ్చు అని ఈ మధ్య వచ్చిన సినిమాలు నిరూపించాయి.మేము ఈ సినిమాని రెగ్యులర్ ఫార్మెట్లో చేయలేదు, డీఫ్రెంట్ కాన్సెప్ట్ తో చేస్తున్నాము.ఇంతకు ముందు నేను చేసిన సినిమాలను దృష్టిలో పెట్టుకొని మా నిర్మాతలు ఈ సినిమా కథ కూడా అడగకుండా నా మీద నమ్మకంతో ఈ సినిమా నిర్మిస్తున్నారు.ఈ చిత్రాన్ని కన్నడ,తెలుగు భాషల్లో షూట్ చేయడం జరిగింది. నటీ, నటులందరూ మాకెంతో సహకరించారు. కన్నడలో “బీగ” పేరుతో,తెలుగులో “లై లవర్స్” పేరుతో తీసుకువస్తున్నాం.పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని అన్నారు.
చిత్ర నిర్మాతలు రమేష్ రెడ్డి, చెక్జల నాగేశ్వర్ రెడ్డి లు మాట్లాడుతూ..శ్రీ నందన్ మాకు 5 సంవత్సరాలుగా తెలుసు.ఈ కథ మాకు చాలా బాగా నచ్చింది.ఇప్పటివరకు కన్నడలో తను చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ సాధించాయి. నబా నటాషా ను హీరోయిన్ గా పరిచయం చేస్తే తను ఇప్పుడు టాప్ హీరోయిన్ అయ్యింది. డిఫ్రెంట్ కాన్సెప్ట్ ఉన్న సబ్జెక్ట్స్ ఉన్న కథలను తీసుకుంటాడు.ఇంతకుముందు తనతో సినిమా చేద్దాం అనుకున్నాము కానీ కుదరలేదు. సైంటిఫిక్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా చాలా బాగా వచ్చింది. అనవసర ఖర్చులు పెట్టించకుండా నిర్మాత అనుకున్న బడ్జెట్ లోనే సినిమా తీసి ఇస్తాడు శ్రీ.ఇందులో పాటలు చాలా బాగా వచ్చాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి అన్నారు.
సంగీత దర్శకుడు శ్రీ గురు మాట్లాడుతూ ..సంగీత దర్శకుడుగా ఇప్పుటి వరకు కన్నడలో చాలా సినిమాలకు చేశాను. ఇప్పుడు తెలుగు సినిమాకు మ్యూజిక్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.
నటుడు ఇర్ఫాన్ మాట్లాడుతూ ..ఈ సినిమా కొరకు నేను చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నాను..ఇప్పటివరకు కన్నడలో నటించిన నాకు ఇప్పుడు టాలీవుడ్ లో చేస్తున్న నా మొదటి సినిమా ఇది. ఈ సినిమాకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి అన్నారు.
హీరోయిన్ సుమితా బజాజ్ మాట్లాడుతూ ..ఇది సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ .ఈ సినిమాను చూసిన వారందరికీ కచ్చితంగా నచ్చుతుంది. అందరూ మా చిత్రాన్ని ఆదరించి ఆశీర్వదించా లని అన్నారు
నటుడు మైత్రి మహర్షి మాట్లాడుతూ. ఇందులో నేను మంచి క్యారెక్టర్ చేశాను.ఈ సినిమా చూస్తున్నంత సేపు అందరూ ఒక ట్రాన్స్ లో ఉంటారు.నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఉత్కంఠను కలిగిస్తుంది.ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు
మాటల రచయిత జమదగ్ని మాట్లాడుతూ.. ఎంత పెద్ద స్టార్ ఉన్నా సినిమాలో సరైన కథ లేకపోతే నిలబడదు. డీఫ్రెంట్ కాన్సెప్ట్ లో వస్తున్న ఈ సినిమాకు కథే బలం. థియేటర్ నుంచి బయటకు వచ్చినా కూడా ఈ కథ మీ మైండ్ లో తిరుగుతూనే ఉంటుంది. అలాంటి మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమా చేస్తున్నాం .త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు.
నటి రాజేశ్వరి మాట్లాడుతూ.. రవిశంకర్ గారి కి ఆపోజిట్ క్యారెక్టర్ చేశాను.ఇప్పటి వరకు కన్నడలో 45 మూవీస్ చేశాను. తెలుగులో నాకిది ఫస్ట్ మూవీ.మీరందరూ ఆదరిస్తే తెలుగులో కూడా ఇలాంటి మంచి మూవీస్ చేస్తాను అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకులు రవికుమార్ చౌదరి, ప్రసన్నకుమార్, సునీల్ కుమార్ రెడ్డి,వీరబద్రం చౌదరి మరియు చిత్ర యూనిట్ సభ్యులు సమక్షంలో చిత్ర దర్శకుడు శ్రీనందన్ తన గురువైన సాగర్ గారిని శాలువాతో సత్కరించారు.
తారాగణం
రవి శంకర్, జడి ఆకాష్, శ్రీనందన్, ఇర్ఫాన్, సహర్ అప్సా, సుమీత, సుమన్ సెట్టి, జబర్దస్త్ నవీన్, సుచింద్ర ప్రసాద్, మహర్షి, వీరు, విజయ్ తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ :HM మూవీ మేకర్స్,
నిర్మాతలు :- HM శ్రీనందన్, రమేష్ ముని కృష్ణప్ప , చక్కల నాగేశ్వర రావు
దర్శకుడు:- HM శ్రీనందన్,
సంగీత దర్శకుడు:- శ్రీ గురు,
ఆర్ ఆర్ :- సునీల్ కశ్యప్,
డి.ఓ.పి:- నాగరాజ్ మూర్తి అల్లికట్టె,
డైలాగ్స్:- జమదగ్ని మహర్షి,
సాహిత్యం:- సురేష్ గంగుల,
పి.ఆర్.ఓ : సతీష్