HomeTeluguఫిబ్రవరి 4న గ్రాండ్ రిలీజవుతున్న కిచ్చా సుదీప్, శివ కార్తీక్, గుడ్ సినిమా గ్రూప్...

ఫిబ్రవరి 4న గ్రాండ్ రిలీజవుతున్న కిచ్చా సుదీప్, శివ కార్తీక్, గుడ్ సినిమా గ్రూప్ ‘కే3 కోటికొక్కడు’

తెలుగు ప్రేక్షకులకు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం సుదీప్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌ కే3 కోటికొక్కడుతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోన్నారు. శివ కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.

కన్నడలో కే 3 చిత్రం విడుదలై ట్రేడ్ లెక్కల ప్రకారం రిలీజ్ చేసిన నాలుగు రోజుల్లోనే దాదాపు 40 కోట్లు వసూలు చేసి సుదీప్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రాన్ని తెలుగులో ఫిబ్రవరి 4న‌ గ్రాండ్ గా విడుద‌ల‌చేయ‌నున్నారు.

ఇప్పటికే విడుదల చేసిన కే3 కోటికొక్కడు ట్రైలర్‌ లో సుధీప్ రెండు విభిన్న పాత్రల్లో మెప్పించారు. మడోన్నా సెబాస్టియన్ సుదీప్ జోడి చూడముచ్చటగా ఉంది. ట్రైలర్‌లో శ్రద్దా దాస్, రవి శంకర్, నవాబ్ షా తదితరులు కనిపించారు. యాక్షన్ ప్యాక్ డ్ గా రిలీజైన కే3 కోటికొక్కడు తెలుగు ట్రైల‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వచ్చింది.

గుడ్ సినిమా గ్రూప్ సంస్థ కే3 కోటికొక్కడు చిత్రాన్ని ఫిబ్రవరి 4న తెలుగులో గ్రాండ్ గా విడుదల చేస్తోంది.

నటీనటులు : కిచ్చా సుదీప్, మడోన్నా సెబాస్టియన్, శ్రద్దా దాస్, ఆఫ్టాబ్ శివ దాసాని, రవి శంకర్, నవాబ్ షా తదితరులు

సాంకేతిక బృందం

డైరెక్టర్ : శివ కార్తీక్
కథ: కెచ్చా సుధీప్
నిర్మాత : శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే
బ్యానర్ : గుడ్ సినిమా గ్రూప్
మాటలు : కే రాజేష్ వర్మ
డీఓపీ : శేఖర్ చంద్ర
మ్యూజిక్ : అర్జున్ జెన్యా
ఎడిటర్ : ప్రవీణ్ ఆంటోని
ఫైట్స్: కణల్ కన్నన్,విజయ్,అనల్ అరస్
పాటలు: కే ఎస్ ఎం ఫణీంద్ర
కొరియోగ్రఫీ: రాజు సుందరం,ఇమ్రాన్ సద్దారియా, జానీ

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES