రామా నాయక్ సమర్పణలో శ్రీ వైష్ణో దేవి పతాకంపై రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం `రియల్ దండుపాళ్యం`. మహేష్ దర్శకత్వంలో సి.పుట్టస్వామి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టియఫ్‌పిసి సెక్రటరి టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ…“మగాడి దాష్టీకానికి ఆడవారు ఎలా బలవుతున్నారో దండు పాళ్యం గత సిరీస్ లో చూపించారు. కానీ ఈ రియల్ దండుపాళ్యంలో మహిళలు వారిపై జరిగే అకృత్యాలు, అన్యాయాలపై తిరగబడితే ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేసారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ ట్రైలర్ చూశాక ఒక కర్తవ్యం, ప్రతిఘటన, మౌనపోరాటం చిత్రాలు గుర్తొచ్చాయి. ఈ సినిమా ప్రతి మహిళ చూడాలి. ఇన్ స్పైర్ అవ్వాలి. రాగిణి యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా చేసింది. ఫిబ్రవరి 4న వస్తోన్న ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలని“ అన్నారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ…“దండుపాళ్యం సిరీస్ తెలుగు, కన్నడ భాషల్లో సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. వాటిని మించేలా `రియల్ దండుపాళ్యం` చిత్రం ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రాగిణి ద్వివేది చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బావున్నాయి. ఈ చిత్రం సక్సెస్ సాధించి నిర్మాతకు మంచి లాభాలు తీసుకరావాలని కోరుకుంటున్నా“ అన్నారు.
నిర్మాత సి.పుట్టస్వామి మాట్లాడుతూ…“తెలుగు, కన్నడ భాషల్లో దండుపాళ్యం సిరీస్ గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటన్నింటినీ మించేలా `రియల్ దండుపాళ్యం ఉండబోతుంది`. సొసైటీలో మగాళ్ళ వంచనకు గురైన ఐదుగురు అమ్మాయిల కథే ఈ ‘రియల్ దండుపాళ్యం’. ప్రతి సన్నివేశాన్ని ఎంతో రియలిస్టిక్ గా తెరకెక్కించాడు దర్శకుడు మహేష్. ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నో సంఘటనలకు అద్దం పట్టేలా ఈ సినిమా ఉంటుంది. అన్ని సెంటర్స్ లో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమవుతుందన్న నమ్మకం ఉంది. ఫిబ్రవరి 4న సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం.
నటి రాగిణి ద్వివేది మాట్లాడుతూ…“ఈ చిత్రాన్ని ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకొని చేశాను. టీమ్ అంతా కూడా ఎంతో హార్డ్ వర్క్ చేశారు. డైరక్టర్ రియల్ ఇన్స్ డెంట్స్ బేస్ చేసుకుని ఈ సినిమాను ఎంతో రియలిస్టిక్ గా తెరకెక్కించారు. గతంలో వచ్చిన సిరీస్ కన్నా రియల్ దండుపాళ్యం అద్భుతంగా ఉండబోతుంది. తెలుగులో తొలి సారి విడుదలవుతోన్ననేను నటించిన యాక్షన్ సినిమా ఇది. ఎంతో ఎగ్జైయిటింగ్ గా ఉంది. తెలుగులో మరో పెద్ద చిత్రంలో నటించాను. ఆ వివరాలు త్వరలో తెలుస్తాయి. ఫిబ్రవరి 4న గ్రాండ్ గా రిలీజ్ అవుతోన్న రియల్ దండుపాళ్యం చిత్రాన్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా“ అన్నారు.
13 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి వరల్డ్ రికార్డ్ సృష్టించిన మాలోవత్ పూర్ణ మాట్లాడుతూ….“పేదరికం దేనికి అడ్డు కాదనీ, ఆడవారు ఎందులో తక్కువకాదనీ, ఏదైనా సాధించలగరనీ నిరూపించడానికే నేను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాను. ఇక ఈ సినిమాలో ఆడవారిపై జరుగుతోన్న అకృత్యాలను చూపిస్తూ దాన్ని సమర్థవంతంగా మహిళలు ఎలా ఎదుర్కోవాలో చూపించారు. ప్రతి మహిళా ఈ సినిమా చూడాలి. ఇలాంటి సందేశాత్మక చిత్రాలు రావాలి“ అన్నారు.
మహేష్ బంజారా మాట్లాడుతూ…“ట్రైలర్ చాలా బావుంది. సినిమా కూడా అదే స్థాయిలో ఉండబోతుంది. మహిళలంతా తప్పక చూడాల్సిన సందేశాత్మక చిత్రమిది“ అన్నారు.
సందీప్ చౌహాన్ మాట్లాడుతూ…“ట్రైలర్ చాలా బావుంది. రాగిణి ద్వివేది యాక్షన్ సినిమాకు హైలెట్. ఆడవారి పై జరిగే అకృత్వాలను కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు. మహిళలు తమపై జరుగుతోన్న అఘాయిత్యాలను ధైర్యంగా ఎదుర్కోవాలి అని తెలియజెప్పే చిద్రమిదని“ అన్నారు.
నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ…“దండు పాళ్యం సిరీస్ తెలుగులో గొప్పగా ఆడాయి. ఆ టైటిల్ తో వస్తోన్న ఈ రియల్ దండుపాళ్యం పెద్ద సక్సెస్ కావాలి. రాగిణి ద్వివేది అందం, అభినయం ఈ చిత్రానికి హైలెట్స్ “ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో మానస. శ్యామ్ సన్, శేఖర్ నాయక్, సందీప్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
రాగిణి ద్వివేది, మేఘన రాజ్, దీప్తి, ప్రధమ ప్రసాద్, సంయుక్త హర్నడ్, యువరాజ్, రఘు బట్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కో-ప్రొడ్యూసర్ః కోయల్ బంజార, ఎమ్ బస్వరాజు నాయక్ (ఎక్స్ ఎమ్మెల్యే) ; పీఆర్వోః చందు రమేష్; నిర్మాతః సి.పుట్టస్వామి , దర్శకత్వంః మహేష్.