HomeTeluguఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అజిత్ 'వాలిమై' విడుదల వాయిదా ప్రకటించిన...

ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అజిత్ ‘వాలిమై’ విడుదల వాయిదా ప్రకటించిన నిర్మాత బోనీ కపూర్


అజిత్ కుమార్ మొదటి ప్యాన్ ఇండియా గా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అజిత్‌ ‘వాలిమై’ ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కావాల్సివుంది. కాగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లిష్ట పరిస్థితులు.. రోజు రోజుకి పెరిగిపోతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసుల నేపథ్యంలో.. ఈ భారీ చిత్రాన్ని థియేటర్స్‌లో ఎంజాయ్ చేయడానికి మరికొన్ని రోజుల సమయం పడుతుందని నిర్మాత బోనీకపూర్ తెలియచేసారు.
ఈ సందర్భంగా నిర్మాత బోనీకపూర్ మాట్లాడుతూ: “అభిమానులు, సినీ ప్రేక్షకజనం ఎంతో ఆసక్తి గా మీరు ఎదురుచూస్తున్న ‘వాలిమై’ చిత్రాన్నివాయిదా విడుదల వేసినందుకు మేము చాలా చింతిస్తున్నాము. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్యా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. థియేటర్లలో మాత్రమే చూడాల్సిన చిత్రం. మీరు సురక్షితంగా, ఎంతో ఆనందంగా థియేటర్లలో స్వేచ్ఛగా వీక్షించాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, అందరి సౌలభ్యం కోసం ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నాం. మీ అందరి ప్రేమ మా సినిమాపై ఎప్పుడూ ఇలాగే ఉంటుందని.మళ్ళీ ఎప్పుడు బిగ్ స్క్రీన్‌పై వచ్చినా కూడా సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం” అన్నారు. జీ స్టూడియోస్‌ సంస్థ, బేవ్యూ ప్రాజెక్ట్స్‌ పతాకంపై బోనీకపూర్‌ నిర్మిస్తున్నఈ చిత్రాన్ని హెచ్. వినోద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES