చాగంటి ప్రొడక్షన్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సినిమా టైటిల్ సి.ఎస్.ఐ. సనాతన్ ని లాంఛ్ చేసారు సెన్సేషనల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి. క్రైమా్ సీన్ ఇన్వస్టిగేషన్ (సియస్ ఐ) ఆఫీసర్ గా ఆదిసాయికుమార్ ఒక కొత్త రోల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఒక పెద్ద షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ ఈ నెల 27న ప్రారంభమవుతుందని చిత్ర నిర్మాత అజయ్ శ్రీనివాస్ అన్నారు. ఆది సాయికుమార్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా టైటిల్ లాంఛ్ చేసిన దర్శకుడు అనీల్ రావిపూడి కాన్సెప్ట్ ని తెలుసుకొని టీం ని అభినందించారు. కాన్సెప్ట్ ని ఎలివేట్ చేసే మోషన్ పోస్టర్ తో అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో రూపొందించిన మోషన్ పోస్టర్ చాలా ఇప్రెసివ్ గా ఉంది. తారక్ పోన్నప్ప, నందిని రాయ్, అలీ రాజా, వసంతి , మధు సూదన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ కథతో శివశంకర్ దేవ్ దర్శకుడి గా పరిచయం అవుతున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు అనీల్ రావిపూడి మాట్లాడుతూః
కాన్సెప్ట్ చాలా బాగుంది. హీరో ఆది సాయికుమార్ చాలా ప్రెష్ గా అనిపించారు. క్రైమ్ థ్రిలర్స్ ని గ్రిప్పింగ్ గా చెప్పగలిగితే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. దర్శకుడు శివశంకర్ దేవ్, నిర్మాత అజయ్ శ్రీనివాస్ లకు ఆల్ ద బెస్ట్ . అన్నారు..
నిర్మాత అజయ్ శ్రీనివాస్ మాట్లాడుతూః
రెండ్రోజుల క్రితమే ఒక లాంగ్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసాము. మరో షెడ్యూల్ ఈ నెల 27 న మొదలవుతుంది. ఈ షెడ్యూల్ లో సినిమా కంప్లీట్ చేస్తాము. ఆది సాయికుమార్ ఇప్పటి వరకూ చేయని పాత్రలో కనిపిస్తారు. సనాతన్ గా ఆయన నటన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాము . అన్నారు..
నటీ నటులు – ఆదిసాయికుమార్, మిషా నారంగ్, అలీ రాజా, నందిని రాయ్, తాకర్ పొన్నప్ప ,మధు సూదన్, వసంతి తదితరులు
సాంకేతిక వర్గం – , సినిమాటోగ్రఫీ ః జిశేఖర్, మ్యూజిక్: అనీష్ సోలోమాన్, పిఆర్ఒ ః జియస్ కె మీడియా,
నిర్మాత ః అజయ్ శ్రీనివాస్ ,దర్శకుడు ః శివశంకర్ దేవ్