HomeTelugu2022లో ఆరు సినిమాలు విడుదల చేస్తాను– నిర్మాత రాజశేఖర్‌ రెడ్డి

2022లో ఆరు సినిమాలు విడుదల చేస్తాను– నిర్మాత రాజశేఖర్‌ రెడ్డి

పాన్‌ ఇండియా సినిమా నిర్మిస్తున్నా– నిర్మాత యం.రాజశేఖర్‌ రెడ్డి సినిమా పరిశ్రమలో వెనుక ముందు తెలిసిన వారు ఎవరు లేకుండా విజయం సాధించటం చాలా కష్టం. అలాంటి కష్టాన్ని ఇష్టంగా చేసుకుని ఎడ్యుకేషనల్‌ కన్సల్టెంట్‌గా ఉన్న నేను ముందుగా పరిశ్రమలో అనుభవం సంపాదించటానికి 2012లో ‘‘ప్రేమలో పడితే’’ చిత్రంతో కో–ప్రొడ్యూసర్‌గా కెరీర్‌ను ప్రారంభించాను అన్నారు ‘‘ శ్రీ షిరిడీ సాయి మూవీస్‌’’ అధినేత రాజశేఖర్‌ రెడ్డి. రాజ మాట్లాడుతూ– ‘‘ 2012లోనే విజయ్‌ ఆంటోనినీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే ఉద్ధేశ్యంతో ‘నకిలీ’ చిత్రాన్ని విడుదల చేశాను. 2013లో ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.యల్‌ విజయ్‌తో ఉన్న పరిచయంతో మేమిద్దరం నిర్మాతలుగా మారి ‘శైవం’ అనే చిత్రాన్ని నిర్మించి చక్కని విజయాన్ని సాధించాం. 2014లో తెలుగులో ‘దిల్‌’ రాజు నిర్మించిన ‘ఓ మై ఫ్రెండ్‌’ చిత్రాన్ని తమిళంలో ‘శ్రీధర్‌’ అనే పేరుతో విడుదల చేశాను. ‘కలర్స్‌’ స్వాతి కీ రోల్‌లో నటించిన ‘త్రిపుర’ చిత్రాన్ని 2015లో నిర్మించాను. తర్వాత ‘కేరాఫ్‌ కంచెరపాలెం’ చిత్రాన్ని తమిళంలో ‘కేరాఫ్‌ కాదల్‌’గా 2021లో విడుదల చేయటం జరిగింది. రాజ మాట్లాడుతూ–‘‘ ప్రస్తుతం 2022లో ఆరు సినిమాలను విడుదల చేయబోతున్నాను అనే విషయాన్ని మీతో పంచుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ఆరు సినిమాలు కూడా పెద్ద టెక్నీషియన్స్‌ గొప్ప నటీనటులతో చేయటం నాలాంటి నిర్మాతలకు చాలా పెద్ద విషయం. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఆది పినిశెట్టి హీరోగా ‘క్లాప్‌’, విజయ్‌ ఆంటోనీ, అరుణ్‌ విజయ్‌ హీరోలుగా భారీ బడ్జెట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘జ్వాల’, విశ్వక్‌సేన్‌ ముఖ్యపాత్రలో నలుగురు ప్రముఖ హీరోయిన్లు నటించిన చిత్రం ‘అక్టోబర్‌ 31’, ప్రకాశ్‌రాజ్‌ కీలకపాత్రలో నవీన్‌చంద్ర, మేఘా ఆకాశ్‌ నటిస్తోన్న ఇంకా పేరు పెట్టని చిత్రం, తమిళ కమెడియన్‌ యోగిబాబు హీరోగా మరో చిత్రాన్ని 2022లో విడుదల చేస్తాను. వచ్చే ఏడాది నా కెరీర్‌లోనే బెస్ట్‌ ఇయర్‌గా చెప్పాలి. కారణం ఏంటంటే బాలీవుడ్, టాలీవుడ్‌ ఆర్టిస్ట్‌లతో ఓ పాన్‌ ఇండియా సినిమాను నిర్మించనున్నాను. నా పదేళ్ల కెరీర్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాలు నిర్మించాను. ఇలాగే సినిమాలు చేస్తూనే ఉంటాను’’ అన్నారు.
రాజశేఖర్‌ రెడ్డి బయోగ్రఫీ:
పేరు– యం.రాజశేఖర్‌ రెడ్డి
ముద్దుపేరు– రాజ
పుట్టినతేది– 29.05.1985
సొంతవూరు– కరాలపాడు, గుంటూరు జిల్లా
ఆంధ్రప్రదేశ్, ఇండియా
వృత్తి– ఎడ్యుకేషనల్‌ కన్సల్‌టెంట్, నిర్మాత
వ్యక్తిగతం– భార్య స్వాతిరావు,
కూతురు– యజ్ఙిత వెంకటసాయి
సినిమాలు–
– ప్రేమలో పడితే 2012 (సహ నిర్మాత) తెలుగు
– నకిలీ 2012 (నిర్మాత) తెలుగు
– శైవం 2013 ( సహ నిర్మాత) తమిళం
– శ్రీధర్‌ 2014 (సహ నిర్మాత) తమిళం
(తెలుగులో ఓ మై ఫ్రెండ్‌)
– త్రిపుర 2015 (నిర్మాత)
– కేరాఫ్‌ కాదల్‌ 2021 (నిర్మాత)
(కేరాఫ్‌ కంచెరపాలెం రీమేక్‌)
– క్లాప్‌ 2022 (నిర్మాత)
తెలుగు,తమిళ చిత్రం
– జ్వాలా 2022 (నిర్మాత)
తెలుగు,తమిళ చిత్రం
– అక్టోబర్‌ 31 (నిర్మాత) 2022
తెలుగు, తమిళ చిత్రం
– ప్రకాశ్‌ రాజ్, నవీన్‌చంద్ర, మేఘాఆకాశ్‌
తెలుగు,తమిళ చిత్రం
(పేరు పెట్టలేదు) 2022 (నిర్మాత)
– యోగిబాబు తమిళ చిత్రం 2022 (నిర్మాత)

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES