స్టార్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో హ్యాపెనింగ్ హీరో సంతోష్ శోభన్, గార్జీయస్ బ్యూటీ మెహరిన్ జంటగా యూవీ క్యాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ల పై ఎస్ కే ఎన్, వి సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం మంచిరోజులొచ్చాయి. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం రిలీజైన ప్రతి ఏరియాలో విజయవంతంగా ప్రదర్శింపబడుతూ సూపర్ హిట్ టాక్ తో ముందుకు సాగుతోంది. ఈ విజయాన్ని ప్రేక్షకులతో స్వయంగా పంచుకోవడానికి చిత్రం బృందం ప్రస్తుతం సక్సెస్ టూర్ లో ఉన్నారు. అందులో భాగంగా నవంబర్ 6న విశాఖ సముద్రతీరాన్ని గ్రాండ్ థ్యాంక్యూ ఈవెంట్ ని చిత్రం బృందం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, విశాఖ ప్రజలు హాజరైయ్యారు. చిత్రం బృందంలో ఉన్న ముఖ్య తారాగణంతో పాటు నిర్మాత ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి, హీరో సంతోష్ శోభన్ తదితరులు ఈ థ్యాంక్యూ మీట్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత ఎస్ కే ఎన్ మాట్లాడుతూ
మంచిరోజులొచ్చాయి చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకి ముందుగా నా ప్రత్యేక ధన్యవాదాలు, భారీ బడ్జెట్ సినిమాలు తీసే దర్శకులు కథను నమ్మి చిన్న సినిమాలు తీయడం చాలా ఆరుదు, ఇదే రీతిలో మారుతి ఇప్పుడు మంచిరోజులొచ్చాయి చిత్రాన్ని తెరకెక్కించారు. సంతోష్ శోభన్ కొత్త హీరో మాదిరి కాకుండా సింగిల్ టేక్ లో సీన్లు కంప్లీట్ చేశారు. ఆయన భవిష్యత్తులో పెద్ద హీరో అవుతారనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఈ చిత్రానికి పని చేసిన అందరికి మరోసారి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ
కరోనా సెకండ్ లాక్ డౌన్ టైమ్ భయం మీద ఓ కాన్సెప్ట్ అనుకొని, 20 రోజుల్లో కథ రాసుకొని 27 రోజుల్లో సినిమా తీశాను. ఇది కేవలం కొంత మంది ఆర్టిస్టులు, టెక్నిషయన్లు కోసమే ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఇది తీసినప్పుడే సక్సెస్ అయిపోయింది, ఇప్పుడు వచ్చేదంతా సక్సెస్ అనుకుంటున్నాను. ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకి మనఃస్ఫూర్తిగా థన్యవాదాలు తెలుపుకుంటున్నాను
హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ
చాలా హ్యాపీగా ఉన్నాను, సినిమాను అంటేనే థియేటర్ లో చూడాలి. థియేటర్స్ లో ఏదైనా మంచి సినిమా విడుదలైతే ఆ చిత్రానికి ఎంతటి విజయాన్ని ఇస్తారో ప్రేక్షకులు మరోసారి మా మంచిరోజులొచ్చాయి చిత్రం ద్వారా నిరూపించారు. ఈ విజయాన్ని మా టీమ్ అందరికీ అందించిన ప్రేక్షకులకు నా ప్రత్యేక థన్యవాదాలు.
ఈ క్యారక్రమంలో నటులు పీడిశ్రీనివాస్, సుదర్శన్ తదితరలు పాల్గొని ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలిపారు
—
Eluru Sreenu
P.R.O