నాకు 90ML అలవాటు లేదు కానీ మా డైరెక్టర్ చెప్పిన కథ ఆ కిక్ ఇచ్చింది – అనూప్ రూబెన్స్

625


కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న 90 ML చిత్రం విడుదలకి సిద్ధంగా ఉండగా, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మీడియాతో మాట్లాడారు.

ఈ చిత్రంలో మొత్తం ఎన్ని పాటలున్నాయి.?

6 పాటలు, ఒక బిట్ సాంగ్ ఉన్నాయి. అన్నీ మాస్ సాంగ్స్ ఉంటాయి, కార్తికేయ బయట ఎలా ఉంటాడో దర్శకుడు శేఖర్ రెడ్డి ఈ చిత్రంలో అలాగే చూపించారు.

ఈ చిత్రంలో సంగీతానికి మంచి స్కోప్ ఉందా. ?

ఈ సినిమాలో సాంగ్స్ కి స్కోప్ చాలా ఉంది అలాగని పాటల నిడివి ఎక్కువ ఉండదు, దర్శకుడు కథని అలా మలిచారు. నేను రెండు మూడు మాస్ సినిమాలు చేసాను కానీ ఇది దానికి పూర్తి భిన్నంగా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది.

ఈమధ్యలో మీ కెరీర్?

ఈమధ్య కాలంలో నేను అనుకున్నవి కొన్ని జరగలేదు, పెద్ద ప్రాజెక్ట్స్ కొన్ని అనుకున్నట్టుగా అవ్వలేదు కానీ నా చేతిలో ఏమి లేదు, సమయం వచ్చినపుడు ఏది అలా జరగాలో అది జరుగుతుంది అని నమ్ముతున్నాను.

దర్శకుడు పూరి గారి తో మీ జర్నీ ఎలా ఉంది?

ఆయన తో నాకు ముందునుండి మంచి అనుబంధం ఉంది, రెగ్యులర్ గా మాట్లాడటమే కాక అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. ఆయన ఒక డైరెక్టర్ గా కంటే మంచి వ్యక్తి గా నాకు బాగా ఇష్టం, పరిచయం.

వెబ్ సిరీస్ కి ఏమైనా పని చేస్తున్నారా.?

ప్రస్తుతానికి ఎలాంటి వెబ్ సిరీస్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఏదైనా ఆసక్తికరమైన ప్రాజెక్ట్ వస్తే తప్పకుండా చేస్తాను.

నితిన్ తో కొత్త చిత్రం ఏమైనా చేస్తున్నారా.?

హీరో నితిన్ తో చిత్రం ఉంటుంది, త్వరలోనే అనౌన్స్ చేస్తాను.

ఒక చిత్రానికి పని చేసేటప్పుడు కథని దృష్టిలో పెట్టుకుంటారా? హీరోని దృష్టిలో పెట్టుకుంటారా?

ముందుగా కథని ఆ తరువాత హీరోని దృష్టిలో పెట్టుకుంటాను. ఎందుకంటే ఎక్కువసార్లు హీరోని బట్టి అతనికున్న క్రేజ్ ని బట్టి కూడా సంగీతం మార్చేయాల్సి ఉంటుంది.

సంగీత దర్శకుల మీద మీద రెండు ఫిర్యాదులుంటాయి, ఒకటి విదేశీ మ్యూజిక్ కాపీ కొడతారని, అలాగే కొట్టిన ట్యూన్లే మళ్ళీ మళ్ళీ కొడతారని, మీరేమంటారు ?

ప్రతీ సంగీత దర్శకుడిలో ఒక స్టైల్ ఉంటుంది. మేము ఇచ్చిన ఒక 100 ట్యూన్స్ లో ఐదు ట్యూన్ లు ఎక్కడో టచ్ అవుతాయి అది కాపీ కాదు, మక్కీ కి మక్కీ దించడం తప్పు. అలా దించడంలో అసలు మ్యూజిక్ డైరెక్టర్ ప్రతిభ ఏముంటుంది.

ప్రస్తుతం ఇంకేవైనా సినిమాలు చేస్తున్నారా?

కన్నడ లో ఒక సినిమా చేస్తున్న, తెలుగులో కొన్ని డిస్కషన్ లు జరుగుతున్నయి. త్వరలోనే పూర్తి సమాచారం అందిస్తాను.

ఈ సినిమాకి ప్లస్ లు చెప్పండి?

నేను చేసాను అని కాదు గాని సంగీతంతో పాటు వైవిధ్యమైన కథ, కార్తికేయ డాన్సులు, కామెడీ ఈ చిత్రానికి బాగా ప్లస్ అవుతాయి అనుకుంటున్నాను.