కరీంనగర్ లో ఘనంగా జరిగిన 90ml ప్రీ రిలీజ్ ఈవెంట్!!

577

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో హీరోగా యువతలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ ఇప్పుడు 90ML తో మనముందుకు రాబోతున్నాడు. నేహా సోలంకి హిరోయిన్ గా కొత్త దర్శకుడు శేఖర్ రెడ్డి యర్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు.

డిసెంబర్ 5న గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కరీంనగర్లో ఏర్పాటు చేయగా, భారీ జనసందోహం మధ్య జే మీడియా అధినేత నరేంద్ర గారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తదితర రాజకీయనాయకులు ముఖ్య అతిధులుగా విచ్చేయగా, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడ మరియు ఆట సందీప్ వంటి వారు ఆటలు, డాన్సులు, పాటలతో అందరినీ అలరించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ “డాన్సులు, ప్రేమ, ఎమోషన్స్ మరియు పాటలు అన్ని అనుకున్నట్టుగా తీయడానికి సహకరించి నన్నెంతగానో సపోర్ట్ చేసిన నా హీరో కార్తికేయకి ధన్యవాదాలు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు మీకు ఎంత నచ్చాయో అర్ధమవుతుంది అందుకు కారణం, అద్భుతమైన లిరిక్స్ ని అందించిన చంద్రబోస్ గారు ట్యూన్స్ అందించిన అనూప్ రూబెన్స్ గారు. అలాగే డిసెంబర్ 5 న విడుదలయ్యే మా చిత్రం కూడా మీకు కచ్చితంగా నచ్చుతుందని నమ్ముతున్నాను” అన్నారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ ” RX100 తరువాత గుణ 369, గ్యాంగ్ లీడర్ చేసాను ఇప్పుడు 90ML చేస్తున్నాను. నేను ఎన్ని క్యారెక్టర్స్ చేసినా మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం అందుకు తగ్గట్టుగా మీరు నన్ను ఆదరిస్తూ వచ్చారు అందుకు ధన్యవాదాలు. కరీంనగర్ లో ఇప్పటివరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదన్నారు కానీ తెలంగాణాలో అతి పెద్ద ఈవెంట్ ఇక్కడే మొదలైంది, ఇక్కడే తెలంగాణా ఉద్యమం పుట్టింది. కరీంనగర్లో మొదలైన ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందని నమ్ముతూ ఈ రోజు మేమిక్కడికి వచ్చాము. ఈరోజుతో మాకు పూర్తి నమ్మకమొచ్చింది, మన రాష్ట్రంలాగే మా చిత్రం కూడా విజయం సాధిస్తుంది” అని అంటూ హీరోయిన్ నేహా సోలంకి తో తెలుగులో తెలంగాణ యాసలో మాట్లాడించారు.