#69 సంస్కార్ కాలనీ” మార్చి 18న విడుదల – నిర్మాత బాపిరాజు

339

లక్ష్మీ పిక్చర్స్, ఆదిత్య సినిమా పతాకంపై ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజయ్ ప్రధాన పాత్రల్లో పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో బి బాపిరాజు, ముతికి నాగ సత్య నారాయణ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం “#69 సంస్కార్ కాలనీ . అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 18న విడుదలకు సిద్ధమైంది. మధుర మ్యూజిక్ లో విడుదలైన పాటలు, ట్రైలర్స్ కి అనూహ్య స్పందన వచ్చింది. సోషల్ మీడియా లో 100 మిలియన్ వ్యూస్ తో ట్రేండింగ్ లో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చి 18న 300 థియేటర్స్ లో #69 సంస్కార్ కాలనీ విడుదల అవుతుంది.

ఈ సందర్భంగా నిర్మాత బాపి రాజు గారు మాట్లాడుతూ “ఎస్తర్ నోరోన్హా ప్రధాన పాత్రలో నటించిన #69 సంస్కార్ కాలనీ చిత్రం మార్చి 18 న 300 థియేటర్స్ పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అవుతుంది. మేము విడుదల చేసిన ట్రైలర్స్ కి పాటలకి, సోషల్ మీడియా లో 100 మిలియన్ పైగా వ్యూస్ తో అనూహ్య స్పందన వచ్చింది. ఇండస్ట్రీ మరియు డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి మంచి స్పందన వచ్చింది. మధుర ఆడియో లో విడుదలైన పాటలకి మంచి స్పందన వచ్చింది, ప్రవీణ్ ఇమ్మడి సంగీతం, గమన్ శ్రీ ,యక్కలి రవీంద్రబాబు గార్ల సాహిత్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఎస్ వి శివరాం గారి సినిమా పనితనం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఆధునిక సమాజంలో మానవ సంబంధాలు గురించి అందమైన కథ తో రొమాంటిక్ సన్నివేశాలతో చాలా గొప్పగా చెప్పారు దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి గారు. ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తుంది. యూత్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా నచ్చుతుంది. ఎస్తర్ గారు పోషించిన వైశాలి పాత్ర ప్రేక్షకులని మేపిస్తుంది అని ఆశిస్తున్నాను. మా సినిమా ప్రతి ఒక్కరు చూడాలి” అని కోరుకున్నారు.

నటీనటులు
ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజయ్, భద్రం,శిల్పా నాయక్ ,రామన్, Fm బాబాయ్,సముద్రం వెంకటేష్ తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : లక్ష్మీ పిక్చర్స్
డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : పి.సునీల్ కుమార్ రెడ్డి
ప్రొడ్యూసర్స్ : బి బాపిరాజు, ముతికి నాగ సత్యనారాయణ
స్టోరీ : గాయత్రీ స్వాతి మంత్రిప్రగడ
మ్యూజిక్ : ప్రవీణ్ ఇమ్మడి
డి ఓ పి : ఎస్ వి శివరాం
ఎడిటర్ : కృష్ణ మండల
లిరిక్స్ : గమన్ శ్రీ ,యక్కలి రవీంద్రబాబు
సింగర్స్ : ఎస్తర్, శ్రీ ప్రసన్న , శ్రీనివాస్ యాదవ్
విఎఫ్ఎక్స్ : శ్యామ్ కుమార్ పి
కలరిస్ట్ : పురుషోత్తం
సౌండ్ ఇంజనీర్ : విష్ణువర్ధన్ కాగిత
పి ఆర్ ఓ : పాల్ పవన్

P.R.O;Pavan Kumar 9849128215