డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, సూపర్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ’22’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేతులమీదుగా విడుదలైన ఫస్ట్‌లుక్, కింగ్ నాగార్జున విడుదలచేసిన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్ వస్తోంది. తాజాగా ఈ చిత్రం నుండి `మార్ మార్ కె జీనా హై..బార్ బార్ యహ మర్నాహై..` లిరికల్ వీడియో సాంగ్‌ను 22-02-2020న ఉదయం 8:59 నిమిషాలకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. అనంతరం..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ – “ఇప్పుడే `22` మూవీ లిరికల్ వీడియో సాంగ్ చూశాను. వెరీ నైస్.. చాలా బాగుంది. శివకు దర్శకుడిగా మొదటి సినిమా. బిఎ రాజు గారు, జయ గారు ఎప్పటినుంచో మాకు తెలుసు. రూపేష్ పోలీస్ డ్రెస్ లో చాలా బాగున్నాడు. సినిమా బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ` 22` కచ్చితంగా ఒక డిఫరెంట్ మూవీ అవుతుంది. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సపోర్ట్ ది ఫిల్మ్“ అన్నారు.