విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా `1992`చిత్రంలోని `చెలియా చెలియా..“ లిరిక‌ల్ వీడియో

424


పివియమ్‌ జ్యోతి ఆర్ట్స్‌ పతాకంపై మహి రాథోడ్‌ హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘1992’. విజయదశమిని పురస్కరించుకుని ఈ చిత్రంలోని ‘చెలియా చెలియా ..“ అంటూ సాగే లిరిక‌ల్ వీడియో సాంగ్ ని సెన్సేషనల్‌ డైరక్టర్‌ వి.వి.వినాయక్‌ లాంచ్‌ చేశారు.

ఈ సందర్భంగా వినాయక్‌ మాట్లాడుతూ…‘1992’ టైటిల్‌తో పాటు సాంగ్‌ ఎంతో ఆసక్తికరంగా ఉంది. కొత్త వారిని ప్రోత్సహించడానికి నేనుప్పుడూ ముందుంటాను. కొత్త వారు చేస్తోన్న ఈ ప్రయత్నం సక్సెస్‌ కావాల‌ని కోరుకుంటున్నా’’అన్నారు.

దర్శకుడు శివ పాల‌మూరి మాట్లాడుతూ..‘‘దర్శకుడుగా ఇది నా తొలి చిత్రం. నేటి సమాజంలో ప్రేమ, పెళ్లిళ్లు ఎలా తయారయ్యాయో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక నేనెంతో ఇష్టపడే దర్శకుడు వి.వి.వినాయక్‌ గారు లిరిక‌ల్ వీడియో లాంచ్‌ చేయడం చాలా హ్యాపీ గా ఉంది. ప్రస్తుతం మా సినిమా ఆఖ‌రి దశలో ఉంది. త్వరలో మిగతా వివరాలు వెల్ల‌డిస్తాం’’అన్నారు.

హీరో, నిర్మాత మహి రాథోడ్‌ మాట్లాడుతూ…‘‘ వినాయక్‌ గారి చేతుల‌ మీదుగా మా సినిమాలో సెకండ్ లిరిక‌ల్ వీడియో సాంగ్ లాంచ్‌ కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు ఆఖరి దశలో ఉన్నాయి. త్వరలో విడుదల‌ తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు.

మహి రాథోడ్‌, మోనా ఠాగూర్‌ , దిల్‌ రమేష్‌, జబర్దస్త్‌ రాజశేఖర్ తదిత‌రులు నటిస్తోన్న ఈ చిత్రానికి నిర్మాత: మహి రాథోడ్‌, రచన-దర్శకత్వం: శివ పాల‌మూరి.