సాయి లక్ష్మి గణపతి మూవీ క్రియేషన్స్ పతాకంపై రోషన్ బాల్ భోగట్టి, ఊర్విజ జంటగా యన్. కె. సాయి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం “యమునా నది”అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్,.నటుడు, దర్శక, నిర్మాత లయన్ సాయి వెంకట్, ,జబర్దస్త్ రాము, తాండవ కృష్ణ,ల చేతుల మీదుగా చిత్రంలోని పాటలను, ట్రైలర్ ను గ్రాండ్ గా విడుదల చేశారు. అనంతరం
గెస్ట్ గా వచ్చిన ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్, పాటలు బాగున్నాయి. దర్శకుడు యన్. కె. సాయి మంచి కంటెంట్ ను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమాకు మంచి విజువల్స్ ఇచ్చాడు. ఈ మధ్య నిర్మాతలు మంచి కథలను సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో మంచి విజయాలు అందుకుంటున్నారు కంటెంట్ బాగుంటే ఆదే పెద్ద సినిమాగా నిలుస్తుంది అనేది కాంతారా నిరూపించింది. ఆలా మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి. అప్పుడే ఇలాంటి నిర్మాతలు ఎన్నో సినిమాలు తీస్తారు. తద్వారా ఎంతో మంది ఆర్టిస్టులకు ఉపాధి దొరుకుతుంది. ఇందులో హీరో, హీరోయిన్ లు ఆర్టిస్టులు అందరూ బాగా నటించారు. మంచి కంటెంట్, మంచి పాటలు, మంచి విజువల్స్ తో వస్తున్న ఈ సినిమా చిత్ర యూనిట్ అందరికీ బిగ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ..”యమునా నది” భారతీయులకు మంచి సెంటిమెంట్. ఆలాంటి మంచి టైటిల్ ను సెలెక్ట్ చేసుకుని తీసిన చిత్ర యూనిట్ కు నా కంగ్రాట్స్. యన్. కె. సాయి డైరెక్షన్ చేస్తూ ఈ సినిమాలో చాలా బాగా నటించాడు.ఇందులో ,సొంగ్స్ బాగున్నాయి. అలాగే ఈ సినిమాలో చాలా మంది గ్లామరస్ ఆర్టిస్టులు ఉన్నారు.ఈ సినిమా విజువల్స్ చూస్తుంటే దర్శక, నిర్మాత సాయి ఈ సినిమాకు ప్రాణం పెట్టి చేశాడు అనిపిస్తుంది. మంచి కథతో వస్తున్న “యమునా నది” సినిమా కచ్చితంగా బిగ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామ్ మాట్లాడుతూ.. నాకిది రెండవ మూవీ ఇలా రెండు సినిమాలు చెయ్యడానికి సాయి గారే కారణం. సాయి గారు ఈ సినిమాకోసం ఎంత కస్టపడ్డారో నేను చాలా దగ్గర నుండి చూశాను చాలా కష్టపడ్డారు. సినిమాచాలా బాగా వచ్చింది. రేపటి నుండి ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ పాటలకు , త్వరలో విడుదల అవుతున్న సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర దర్శక, నిర్మాత యన్. కె. సాయి మాట్లాడుతూ.. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీసి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలనే ప్యాషన్ ఉండడంతో ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఈ సినిమాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కష్టపడి ఈ సినిమా తీయడం జరిగింది. నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో తక్కువ బడ్జెట్ లో మంచి సినిమా తియ్యగలిగాను. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యమునా నది సినిమా ప్రేక్షకులందరినీ తప్పకుండా అలరిస్తుందని కోరుకుంటున్నాను అన్నారు.
హీరో రోషన్ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.
నటేనటులు
రోషన్ బాల్ భోగట్టి (హీరో ), ఊర్విజ (హీరోయిన్ ), ఓంకార్, బుగతా సత్యనారాయణ తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : సాయి లక్ష్మి గణపతి మూవీ క్రియేషన్స్
నిర్మాత , దర్శకత్వం : యన్. కె. సాయి
కెమెరామెన్ : బి. బి. రాజు, అనిల్
మ్యూజిక్ : శ్రీరామ్
ఎడిటర్ : బాబీ
లిరిసిస్ట్ : చిన్నికృష్ణ తుడుము, వెంకట్
కో ప్రొడ్యూసర్ : శ్రీదేవి, తాతాలు,నానాజీ, బీబీ, సూరమ్మ, సిలారీ
పి. ఆర్ ఓ : బాబు నాయక్