ఆగ‌ష్టు 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన మెస్ట్ ఎవైటెడ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ” సాహో” 

588

‘బాహుబలి చిత్రం తరువాత  ప్ర‌పంచ సినిమా బాక్సాఫీస్ ఒక్క‌సారిగా  యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్  న‌టిస్తున్న సాహో చిత్రం వైపుకి మళ్ళిన విష‌యం తెలిసిందే.. ఇండియాలో మెట్ట‌మెద‌టిగా  అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జి తో తెరెకెక్కుతున్న ఈ చిత్రం అగ‌ష్టు 15 న భార‌తదేశ స్వాతంత్ర దినోత్సవం సంద‌ర్బంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లకి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేశారు. బాహుబలి లాంటి చిత్రం త‌రువాత వ‌స్తున్న చిత్రం కావ‌టం తో రెబ‌ల్‌స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ అంద‌రూ ఈ సినిమా పై భారి అంచ‌నాలు పెట్టుకున్నారు. దీంతో మేక‌ర్స్ ఎక్క‌డా చిన్న విష‌యం లో కూడా కాంప్ర‌మైజ్ కాకుండా ఆడియ‌న్స్ కి పూర్తి వినోదాన్ని క్లారిటి ఆఫ్ క్వాలిటి తో అందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. హైస్టాండ‌ర్డ్ వి ఎఫ్ ఎక్స్ ని యూజ్ చేయ‌టం వ‌ల‌న హ‌డావుడి కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా వున్న సినిమా ల‌వ‌ర్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రానికి సంబందించిన వ‌ర్క్ జ‌రుగుతుంది. అందుకే ఇండిపెండెన్స్ డే లాంటి మంచి డేట్ ని కూడా మేక‌ర్స్ వ‌దులుకుని అగ‌ష్టు 30న ఈ చిత్రాన్ని అందింస్తున్నారు. పూర్తి క్రిస్ట‌ల్ క్లారిటి గా రెబ‌ర్‌స్టార్ ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా ఈ సాహో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.